IMG 20231015 WA0103 e1697372551487

 

పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు మరియు హెయిర్ ఫాల్స్ కి ఎక్కువగా గురవుతున్నారని సినీనటి వైష్ణవి చైత్యన అన్నారు. ఆదివారం ఆమె కోకాపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ని సినీనటులు ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ తో కలిసి ప్రారంభించారు.

IMG 20231015 WA0105

ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ చర్మ వ్యాధుల్లో మరియు హెయిర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం అధునాతన శస్త్ర చికిత్సలు నగరంలో కూడా అందుబాటులోకి వచ్చాయని ఒకప్పుడు ముంబై, చెన్నై, బెంగళూరు, ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చేదని అన్నారు.

అత్యాధునిక పరికరాలతో, ప్రపంచ స్థాయి వైద్యం అందించేందుకు సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ని కోకాపేట్ లో ఏర్పాటుచేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులను అభినందించారు.

IMG 20231015 WA0104

నేటి యువత, మహిళలు స్కిన్‌కేర్‌ మరియు హెయిర్ పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని అలాంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

 

నగర వాసుల అవసరాలు తీర్చేందుకు నగరంలో మరిన్ని శాఖలు తెరవనున్నామని నిర్వాహకులు డాక్టర్‌ రాజ్ కిరీటి ఈ. పి. మరియు డాక్టర్ శ్రీదేవి తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *