బాబు మోహన్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న రెడ్డి మల్టీప్లెక్స్ మూవీస్ కోబలి అండ్ సోషల్ వర్కర్స్ !

reddys multy flx 1 e1681752211760

ప్రతి రోజు సినిమా ఇండస్ట్రీకి కోటి కలలతో వచ్చే వారు ఎంతోమంది ఉంటారు. ఆ కలలను సాకారం చేయడం కోసం రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. ప్రొడక్షన్ హౌస్ స్థాపించినట్లు యువ నిర్మాత విజయ్ రెడ్డి తెలిపారు. లాంగ్ టర్మ్ ప్లానింగ్‌తో వరుస సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అందులో భాగంగా సోమవారం రామానాయుడు స్టూడియోస్ ఆవరణలో మూడు సినిమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

reddys multy flx

రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కిస్తున్న సినిమా ‘సోషల్ వర్కర్స్’. ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ కథతో రూపొందుతున్న చిత్రమిది.

reddys multy flex 5 6

మహేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘కోబలి’. ఇందులో మిత్ర ప్రధాన పాత్రధారి. మరియు సహ నిర్మాత.

reddys multy flex 5 3

‘సోషల్ వర్కర్స్’, ‘కోబలి’ సినిమా పూజా కార్యక్రమాలకు ప్రముఖ నటుడు బాబు మోహన్, పలువురు రాజకీయ నాయకులు అతిథులుగా హాజరు అయ్యారు. పూజ అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలతో పాటు ‘హ్యాపీ విమెన్స్ డే’ సినిమాను రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ సంస్థ ప్రకటించింది.

reddys multy flx 3

బాబు మోహన్ మాట్లాడుతూ ”ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 20 సినిమాలు ప్లాన్ చేశారు. రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. ‘సోషల్ వర్కర్స్’ సినిమా ఓపెనింగ్ కు నన్ను పిలిచారు. ఆ తర్వాత ముందు నుంచి ఈ సినిమాలో ఓ పాత్రకు నన్ను అనుకుంటున్నట్లు చెప్పారు. అలా ఈ సినిమాలో నేనూ ఓ భాగం అయ్యాను.

reddys multy flex 5 78

ఇది కాకుండా ‘కోబలి’ అని ‘అరుంధతి’ తరహాలో మరో సినిమా చేస్తున్నారు. మంచి ఉద్దేశంతో విజయ్ రెడ్డి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.

reddys multy flex 4

రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ అధినేత విజయ్ రెడ్డి మాట్లాడుతూ ”ముంబైలో మేం ఈ ‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్’ కార్పొరేట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాం. ఆల్ ఓవర్ ఇండియాలో మాకు ఆఫీసులు ఉన్నాయి.

ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖలో ఆఫీసులు తెరిచాం. అన్ని భాషల్లో థియేట్రికల్, ఓటీటీ సినిమాలు తీస్తాం. త్వరలో ‘సోషల్ వర్కర్స్’ సినిమా స్టార్ట్ చేస్తాం. సినిమా రంగంలో బాధలు దీని కథాంశం.

reddys multy flex 5

తర్వాత ‘కోబలి’ సెట్స్ మీదకు వెళుతుంది. అది హారర్ బేస్డ్ యూత్ ఫిల్మ్. విశాఖలో రెండు సినిమాలు తీయాలని ప్లాన్ చేశాం. త్వరలో వాటిని అనౌన్స్ చేస్తాం. కథలు రెడీ చేసుకున్న ఔత్సాహిక దర్శకులు గానీ, చిత్రసీమలో రాణించాలనుకుంటున్న నటీనటులు మమ్మల్ని సంప్రదించండి” అని చెప్పారు.

reddys multy flex 11

‘కోబలి’ దర్శకుడు మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ ”దైవశక్తి, క్షుద్రశక్తి మధ్య జరిగే యుద్ధంతో తీస్తున్న చిత్రం “కోబలి”. మే లేదా జూన్ నెలలో తూర్పు గోదావరి జిల్లాలో చిత్రీకరణ చేద్దాం అనుకుంటున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు.

reddys multy flex 11 12

‘సోషల్ వర్కర్స్’ దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ ”సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో కథ ఉంటుంది. ఇండస్ట్రీలో పరిస్థితులను సినిమాలో చూపిస్తున్నాం. ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారు. అందరివీ ప్రాముఖ్యం ఉన్న పాత్రలు. అవకాశం ఇచ్చిన విజయ్ రెడ్డి గారికి థాంక్స్” అని చెప్పారు. హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *