Ayyagaru Movie Glimpse Launched by Director Ajay Bhupathi: Rx100 దర్శకుడు అజయ్ భూపతి చేతుల మీదుగా ‘అయ్యగారు ’(పెళ్ళికి రెడీ ) చిత్రం టీజర్ గ్లింప్స్ విడుదల !

Ayyagaaru movie trailer launch e1700908031446

ఏంజల్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా… కొత్త దర్శకుడు అర్మాన్ మెరుగు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం అయ్యగారు (పెళ్ళికి రెడీ) ఎనర్జిటిక్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ. వెంకట రమణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ గ్లింప్స్ ని ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఆవిష్కరించి చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. మంచి కామిడీ మరియు యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ లా ఉంది అని చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకుడు, అర్మాన్ మెరుగు గారు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి తానే దర్శకత్వం, మరియు హీరోగా నటిస్తున్నానని, నేటి యువత కు అద్దం పట్టేలా ఒక సెన్సిటివ్ పాయింట్ ని ఎoటర్టైన్మెంట్ తో మిలితం చేసి తెరకేక్కిస్తున్న చిత్రం ఇది. అందరిని నవ్విస్తూ మనిషి యొక్క విలువలు చెప్పడమే మా సినిమా ముఖ్య ఉద్దేశం. ఈ చిత్రం తప్పకుండ ప్రేక్షకులను అల్లరిస్తుందని నమ్ముతున్నాం అని అన్నారు. దర్శకత్వం మరియు నటన తో పాటు సంగీతం కూడా తానే వహిస్తున్నట్లు తెలిపారు.

Ayyagaaru movie trailer launch 1

నిర్మాత వెంకట రమణ గారు మాట్లాడుతూ.. దర్శకుడు అర్మాన్ చెప్పిన కథ నచ్చడం తో ఈ కథను ఎలాగైనా ప్రజల్లోకి తీసుకురావాలని నిర్మించడం జరిగిందని, తప్పకుండ ప్రేక్షకులు మా సినిమా ను ఆదరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో.. సినిమాటోగ్రఫీ, సి.యస్ చంద్ర కొరియోగ్రఫర్., మోహన్ కృష్ణ యాక్టర్స్., సునీల్ రావినూతల, రాజేష్, చిత్ర టీం., జోసెప్ సంపంగి, శ్రీనివాస్ నాయక్ , గోపి చందు తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు:

అర్మాన్ మెరుగు, సిద్ధి ఖన్నా, వెంకట రమణ, సునీల్ రావినూతల, ప్రకాష్, రాజేష్, మహేష్, గోపి చందు, మేఘన అనిమిరెడ్డి,

సాంకేతిక నిపుణులు:

కెమెరామాన్ : సి. యస్ చంద్ర, ఎడిటర్: కేసీబీ హరి, సంగీతం: అర్మాన్ మెరుగు, పీఆర్వో:.బి. వీరబాబు;
మారెన్న,  లిరిక్స్ : అర్మాన్ మెరుగు, బాలా లింగేశ్వర్, శ్రీనివాస్ తమ్మిశెట్టి, ప్రశాంతి పొలకి, క్రొరియోగ్రఫి : మోహన్ కృష్ణ, సాగర్ వేలూరు, జిత్తు
నిర్మాత : ఎ. వెంకట రమణ, కథ స్క్రీ‌న్‌ప్లే, దర్శకత్వం, డైలాగ్స్ : అర్మాన్ మెరుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *