Atia’s Kitchen Inaugurated by Actor Ali: యాక్టర్ ఆలీ చేతులమీదగా  అతియాస్ కిచెన్  ప్రారంభం ! ఎక్కడంటే !

Ali opens a resturent in Madhapur e1712340411762

ఏప్రిల్ 5 శుక్రవారం గండిపేట మెయిన్ రోడ్, షాప్ నంబర్ 6లో అతియాస్ కిచన్ ని సినీ నటులు ఆలీ, సతీమణి జుబెదా ఆలీతో ముఖ్య అతిధిగా విచ్చేసి గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ఆలీ కుటుంబం ఈరోజు ఇఫ్తార్ విందుని అతియాస్ కిచెన్ లో కుటుంబ సమేతంగా విచ్చేసి, సాయంత్రపు అల్లా ప్రార్థన అనంతరం ప్రారంభించారు..

Ali opens a resturent in Madhapur 3
ఆలీ మాట్లాడుతూ: నాకు షేక్ యూసఫ్, అతియా ఇద్దరూ మలేసియాలో పరిచయం, అక్కడ కూడా వీరికి హోటల్స్ ఉన్నాయి, కానీ ఇండియాలో హైదరాబాద్లో కిచెన్ ఓపెన్ చెయ్యాలని ఎప్పుడో అన్నారు, 2023 డిసెంబర్ లోనే ప్రారంభం అవ్వాలిసింది, కానీ ఇప్పుడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వీరి దగ్గర ఇండో, అరబిక్ రుచులే కాక్కుండా ఢిల్లీ రుచులు, నెల్లూరు రుచులు కూడా అద్భుతంగా ఉంటాయి, మొన్న మా ఇంటికి నెల్లూరు స్టైల్ లో వంటలు చేసి పంపారు.. నిజంగా అద్భుతంగా ఉన్నాయి ఆ టేస్ట్లు..

Ali opens a resturent in Madhapur 2

జుబెదా ఆలీ మాట్లాడుతూ:- భోజన ప్రియులకు అతియాస్ కిచెన్ అనేది మంచి వేదిక, నార్త్ ఇండియన్, అరబిక్, వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల రుచులు వీరి దగ్గర ఉన్నాయి.. మండీ కూడా ఇక్కడ చాలా స్పెషల్, కోకాపేటలో మెయిన్ సెంటర్ లో ఇంత పెద్ద కిచెన్ పెట్టడం నిజంగా హ్యాపీగా ఉంది.

Ali opens a resturent in Madhapur 1

అతియాస్ కిచెన్ అధినేత షేక్ యూసఫ్ అహమద్ మాట్లాడుతూ: ఇండియాలో మొదటి సారి మా కిచెన్ లాంచ్ చేస్తున్నాం. మేము అంత పెద్ద బ్రాండ్ కాకపోయినా ఆలీ గారూ లాంటి వ్యక్తి మాకు సపోర్ట్ గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీ ఫ్లేవర్స్ తో కరీమ్స్ ముఘలై జయకా కూడా ప్రారంభించాం. అతియాస్ కిచెన్ నెల్లూరు ఫ్లేవర్స్ పేరుతో ఇంకో బ్రాంచ్ ఉంది, అందులో టిఫిన్స్, లంచ్, డిన్నర్ అన్ని ఉంటాయి. చిన్న బ్రాండ్ అయినప్పటికీ పెద్ద రెస్టారెంట్ లకి పోటీగా అంతకు మించి రుచిగా మా వంటలు ఉంటాయి..

సంస్థ అధినేత్రి అతియా మాట్లాడుతూ: అల్లా దయ వల్ల ఇండియాలో కూడా ఈ కిచెన్ ను ప్రారంభించాం. ఇక్కడ మన హైదరాబాద్ లో ఓపెన్ చెయ్యడం చాలా స్పెషల్, ఇండో, అరబిక్ రుచుల కోసం మీరు మా దగ్గరకు రావొచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *