IMG 20230908 WA0081

 

టాలెంటెడ్ యాక్టర్ వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ “అతిథి”. ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. “అతిథి” వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు.

IMG 20230906 WA0025

ఇవాళ “అతిథి” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే…ఒంటరిగా పెద్ద భవంతిలో ఉంటున్న వేణుకు దెయ్యాలంటే నమ్మకం ఉండదు. ఎక్కడో ఒక ఆడది దెయ్యంగా మారిందని, అమ్మాయిలందరూ దెయ్యలంటే ఎలా అని అడుగుతాడు. మీ ఇంట్లో ఉన్నది మనిషి కాదు దెయ్యం అని తన మిత్రుడు చెప్పినా నమ్మడు. కానీ ఆ అమ్మాయి వింతగా ప్రవర్తిస్తుంటుంది.

IMG 20230908 WA0132

ఇంతకీ ఆమె ఎవరు?, మనిషా, దెయ్యామా? అనేది సిరీస్ లో చూడాలి. మేకింగ్ క్వాలిటీ, యాక్టర్స్ పర్ ఫార్మెన్స్, ట్రైలర్ లో ట్విస్ట్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్ని కథలు మొదలుపెట్టడం సులువు, ముగించడం కష్టం, కథలకు ముగింపు ఇద్దామా అనే డైలాగ్స్ “అతిథి” పై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

IMG 20230905 WA0056

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ఈ నెల 19 నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్, దయ వంటి సిరీస్ లు సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో “అతిథి”పై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *