మూవీ : (Atharva):
విడుదల తేదీ: 30 – 11- 2023.
నటి నటులు : కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా, కల్పిక గణేష్అ, రవింద్ కృష్ణ, గగన విహారి, G మారిముత్తు, కబీర్ దుహన్ సింగ్ మరియు తదితరులు..,
దర్శకత్వం: మహేష్ రెడ్డి,
నిర్మాతలు: సుభాష్ నూతలపాటి, నూతలపాటి నరసింహం,
నిర్మాణ సంస్థ: పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్,
సంగీతం: శ్రీ చరణ్ పాకాల,
సినిమాటోగ్రఫీ: చరణ్ మాడవనేని,
ఎడిటర్:
అథర్వ రివ్యూ (Atharva Review):
కరోనా తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అభివృద్ది చెందిన తర్వాత సినిమా చూసే ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఇతర భాషల నుండి వచ్చే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలోని చిత్రాల మీద ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. ఇలాంటి జానర్లనే అన్ని భాషలలోని సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతన్నారు.
క్రైమ్ అంటే అందరికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ గుర్తుకు వస్తుంది. కానీ క్లూస్ టీం ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడమే ఈ అథర్వ మూవీ లో కొత్త పాయింట్. ఇలాంటి కొత్త పాయింట్ తో కధ రాసుకొన్న హవా మూవీ దర్శకుడు మహేష్ రెడ్డి వర్ధమాన యువ నటుడు కార్తీక్ రాజు సిమ్రన్ చౌదరి ఐరాలను హీరో హీరోయిన్లుగా పెట్టి ఈ అథర్వ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు.
ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కధ మీద ఉన్న నమ్మకం తో సినీ ప్రముఖులకు, మీడియా వారికి స్పెషల్ ప్రీమియర్స్ హైదరాబాద్ లో వేశారు. మా 18F మూవీస్ టీం కూడా ఈ ప్రీమియర్ కి అఅటెండ్ అయ్యి వచ్చి తెలుగు ప్రేక్షకుల కోసం ఈ చిత్ర సమీక్షా ఇక్కడ ప్రచురిస్తున్నాము.
కధ పరిశీలిస్తే (Story Line):
దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు) వరంగల్ దగ్గర లొని గ్రామం లో ఉంటూ ఎలాగైనా పోలీస్ శాఖ లో జాబ్ సంపాదించాలి అని కష్ట పడుతుంటాడు. పోలీస్ అయ్యి మర్డర్ కేసులను తను ఇన్వెస్టిగేట్ చేయాలని కలలు కంటూ ఉంటాడు. కానీ అతనికి ఆస్తమా ఉండుట వలన పోలీస్ శాఖ ఫిట్ నెస్ సెలక్షన్లలో ఫెయిల్ అవుతాడు. కానీ పట్టు పట్టి క్లూస్ టీంలో జాయిన్ అవుతాడు. తన తెలివితో దొంగతనాల కేసును క్షణాలో పరిష్కరిస్తాడు.
ఈ క్రమంలోనే తన కాలేజ్ మేట్ అయిన నిత్య (సిమ్రన్ చౌదరి) క్రైమ్ రిపోర్టర్‌గా మళ్లీ తన జీవితంలోకి వస్తుంది. ఆమె మీదున్న ప్రేమను అప్పటి కాలేజ్ లో లఅనే ఇప్పుడు కూడా బయటకు చెప్పలేకపోతాడు కర్ణ. నిత్య ఫ్రెండ్ జోష్ని (ఐరా) హీరోయిన్ పాపులర్ అవుతుంటుంది. అనుకోని కారణం తో హీరోయిన్ జోష్ని ఇంట్లోనే ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు క్లోస్ చేస్తారు. అక్కడ మర్డర్ జరిగిందని, వేరే వ్యక్తి చంపాడని ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో కేసును అలా ముగించేస్తారు. కానీ నిత్య మాత్రం ఆ విషయాన్ని నమ్మదు. ఇక కర్ణ సైతం ఆ కేసును సాల్వ్ చేయాలని అనుకుంటాడు.
అసలు జోష్ని, శివల నేపథ్యం ఏంటి?
వాళ్లిద్దరు ఎందుకు చంపబడ్డారు ? ఎవరు చంపారు?
పోలీస్ లు అనుమనిస్తున్నట్టు శివ నే జోష్ని ని అనుమానంతో చంపి తను ఆత్మ హత్య చేసుకొన్నాడా ?
అథర్వ కర్ణ కి దొరికిన క్లూస్ ఏంటి ? కర్ణ అనుమణిస్తున్నట్టు అవి హత్య లేనా ?
కర్ణ నిత్య ల ప్రేమ కధ ఎలాంటి మలుపులు తీసుకోంది ?
అసలేం జరిగి ఉంటుంది? అసలు హంతకుడు ఎవరు ?
ఒక్క క్లూ కూడా లేని ఈ కేసును కర్ణ ఎలా పరిష్కరించాడు?
అన్న ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ అనిపిస్తే ఎంటనే థియేటర్లో ఈ అథర్వ మూవీ చూడాల్సిందే.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
దర్శకుడు మహేష్ రెడ్డి అనుకొన్న కథ వస్తువు కొత్తగా ఉన్నా సినిమా మొదటి అంకం కథనం రెగ్యులర్ సినిమా ఫార్మాట్ లోనే సాగుతుంది. ఈ ఫార్మాట్‌లో ఇది వరకు చాలానే కథలు వచ్చాయి. ఈ మధ్యనే హిట్ సిరీస్ లో కూడా రెండు కధలు చూసాము. కానీ ఓ పోలీస్ కాకుండా.. ఓ క్లూస్ టీం ఆఫీసర్ ఎలాంటి క్లూలు లేకుండా ఇన్వెస్టిగేట్ చేయడం అనేది కొత్తగా ఉన్నా కొన్ని సీన్స్ కధనం (స్క్రీన్ – ప్లే ) స్లో వలన అక్కడక్కడా బోర్ ఫీల్ అవుతారు.
ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో వచ్చే చిత్రాలు కధ కంటే కధనం ఇంటరెస్ట్ గా సాగితేనే ప్రేక్షకుడు సినిమా లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇంకా సిన్మా మొదటి సారీ చూసిన వారికి ట్విస్టులు, థ్రిల్స్ తెలిసిపోతాయి కాబట్టి, రెండో సారి చూసే వారికి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోవచ్చు.
కానీ దర్శకుడు మహేష్ వ్రాసుకొన్న కధనం తో సినిమా నిడివి తక్కువ గా ఉండుట వలన అథర్వ సిన్మా రెండవ సారీ చూసే వారికి కూడా నచ్చ వచ్చు. అథర్వ సినిమాలోనూ మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) లొని చిన్న చీనా లోపాలను కొంచెం సరి చేసి ఉంటే ఇంకా ఎంగేజింగ్‌గా ఉంది సినిమా రిజల్ట్ మరో లా ఉండేది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
ర్శకుడు మహేష్ రెడ్డి రాసుకున్న కథ, కథనం బాగుంది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఫార్మాట్‌లో గతం లో చాలానే సినిమా లు వచ్చాయి, కానీ అవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేసన్ లోనే కధనం సాగుతాయి. కాని మహేష్ రెడ్డి వ్రాసుకొన్న కధ లో కొత్తదనం ఏంటంటే ఓ క్లూస్ టీం ఆఫీసర్ ఎలాంటి క్లూలు లేకుండా ఇన్వెస్టిగేట్ చేయడమే కొత్తగా ఉంటుంది.
యువ నటుడు కార్తీక్ రాజు పోసించిన అథర్వ కర్ణ పాత్ర సినీ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్‌తో ఉన్న టైంలో కామెడీ, కేసును చేదించే టైంలో సీరియస్ నెస్, ప్రేయసితో ఉన్నప్పుడు లవ్ యాంగిల్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ చూపించాడు కార్తీక్. హీరోయిజం కోసం కావాలని సీన్లు, ఫైట్లు లేకుండా సహజంగా నటించాడు.
హీరోయిన్ సిమ్రన్ చౌదరి తెరపై అందంగా కనిపించింది. నిత్య పాత్రలో వదిగిపోయింది. సినిమాలో సినిమా హీరోయిన్ జోష్నిగా కనిపించిన ఐరా కూడా ఓకే అనిపిస్తుంది. పోలీసు పాత్రలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
కెమెరామెన్ చరణ్ మాధవనేని ఇచ్చిన విజువల్స్ చాలా బాగా కుదిరాయి. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు నైట్ ఎఫెక్ట్ షాట్స్ చాలా ఇంపార్టెంట్. చరణ్ లైటింగ్ సినిమా మూడ్ ని బాగానే క్యారీ చేసింది.
శ్రీ చరణ్ పాకాల అందించిన పాటలు బాగున్నాయి. కానీ ఆర్ఆర్ మీదే అందరి దృష్టి పడుతుంది. అథర్వ లొని కొన్ని సీన్స్ కి శ్రీ చరణ్ ఇచ్చిన BGM సీన్స్ ని బాగా ఎలివెట్ చేసింది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి శ్రీ చరణ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ యాక్ట్ అని చెప్పవచ్చు.
ఎడిటర్ ఈ సినిమాను షార్ప్ అండ్ క్రిస్పీగానే కట్ చేశాడు. సెకండాఫ్ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది.
నిర్మాతలు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా బాగానే ఖర్చు చేసినట్టుగా కనిపిస్తోంది. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టే కనిపిస్తోంది.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
రెండో సారి ట్విస్టులు అన్నీ తెలిసిపోవడంతో అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోవచ్చు. కానీ అథర్వ మాత్రం అలా అనిపించకపోవచ్చు. అథర్వ సినిమాలోనూ కొన్ని లోపాలున్నాయి. కానీ ఎంగేజింగ్‌గా తీయడంలో సక్సెస్ అయ్యాడు.
అథర్వ మూవీ మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్ప్ర) కాస్త స్లోగా సాగుతుంది. దర్శకుడు అసలు కథ ప్రారంభించడానికి కాస్త టైం తీసుకున్నాడా అనిపిస్తుంది. 20 నిముషాలు తర్వాత వచ్చే రాబరీ కేసు నుంచి సినిమా పుంజుకుంటుంది. హీరోయిన్ జోష్ని మర్డర్‌తో ఆసక్తికరంగా మారుతుంది. సినిమా ఇంటర్వెల్‌కు వచ్చే టప్పటికి ఇంట్రెస్ట్ గా మారుతుంది.
అయితే రెండవ అంకం ( సెకండ్ ఆఫ్) ప్రారంభం మళ్లీ నెమ్మదించినట్టుగా అనిపించినా ఇన్వెస్టిగేసన్ వివిద ప్రాంతాలకు వెళ్ళడం తో ప్రేక్షకులు కధలో ఇన్వాల్వ్ అయిపోతారు. చివరి 40 నిముషాలు మాత్రం సినిమా పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి.
ఈ క్రమంలో అప్పటి వరకు చూసిన అంతా ఒకెత్తు అయితే.. చివర్లో ఒకెత్తులా ఉంటుంది. ఇక అథర్వ రెండో పార్ట్‌కి కూడా మంచి లైన్‌ను రెడీ చేసుకొని దర్శకుడు క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఇలా మొత్తానికి దర్శకుడు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యాడనిపిస్తోంది.