Atharva Director Special Interview:‘అథర్వ’ సిన్మా  సినీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది :. డైరెక్టర్ మహేష్ రెడ్డి !

IMG 20231127 WA0161 e1701089026134

 

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ‘. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు.

డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో మూవీ డైరెక్టర్ మహేష్ రెడ్డి మా 18F మూవీస్  మీడియా ప్రతినిధి తో ముచ్చటించారు. ఆ విశేషాలివే మి కొసం ఇక్కడ ప్రచురిస్తున్నాము..

 అథర్వ’ కథ ఎలా పుట్టింది? ఈ కథకు మూలం ఏంటి?

క్లూస్ టీం హెడ్ వెంకన్న గారి ఇంటర్వ్యూని చూశాను. మామూలుగా ఓ క్రైమ్ జరిగినప్పుడు క్లూస్ టీం చేసే పనే అధికంగా ఉంటుంది. వారు సేకరించేవే కోర్టులో సాక్ష్యాలుగా నిలబడతాయి. క్రైమ్‌ కేసుని 70 శాతం వరకు క్లూస్ టీం పరిష్కరిస్తుంటుంది. అలా క్లూస్ టీం గురించి ఇంత వరకు ఎవ్వరూ చెప్పలేదు.. వాళ్ల గురించి చెప్పాలని ఈ కథ రాసుకున్నాను.

IMG 20231127 WA0163

 అథర్వలో ఎలాంటి సీన్లు ఎక్కువగా ఉంటాయి? ఈ మూవీ ఏ జానర్‌లో ఉంటుంది?

అథర్వ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది. మర్డర్, రాబరీ సీన్లతో సినిమాను అల్లుకున్నాను. చాలా వరకు రియలిస్టిక్‌గా ఉంటుంది. యదార్థ సంఘటనలను కూడా ఇందులో వాడకున్నాం. కాకపోతే సినిమా కోసం కాస్త ఫిక్షన్ కూడా యాడ్ చేశాను.

 ఈ సినిమాకు కార్తీక్ రాజు ఎలా పని చేశారు? మీరు అనుకున్న రిజల్ట్ వచ్చిందా?

ఈ మూవీకి నేను మాత్రమే కొత్తవాడ్ని. అందరికీ సినిమాలు చేసిన అనుభవం ఉంది. కార్తీక్ రాజు ఆల్రెడీ మూవీస్ చేశాడు. సీనియర్ ఆర్టిస్టులు కూడా పని చేశారు. ఈ మూవీకి వారి అనుభవం కలిసి వచ్చింది.

IMG 20231127 WA0162

అథర్వ’లో ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి?

అథర్వ చిత్రం సెకండ్ హాఫ్‌లో ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఎవ్వరూ ఊహించరు. ఆ సీన్లకు ప్రేక్షుడికి ఫుల్ హై వస్తుంది.

 ‘హవా’ తరువాత ‘అథర్వ’ తీయడానికి ఎందుకు ఇంత లేట్ అయింది?

‘హవా’ని సినిమాగా ప్లాన్ చేయలేదు. నేను, చైతన్య రావు కలిసి ఏదో ఒకటి చేయాలని, ఇండస్ట్రీలోకి రావాలంటే ఓ కార్డ్‌లా ఉండాలని, ఓ ప్రయోగం చేశాం. అదే హవా. అది షార్ట్ ఫిల్మ్‌గా అనుకున్నాం. చివరకు అదే సినిమాలా మారింది. మంచి చిత్రాన్ని తీయాలనే ఇంత గ్యాప్ తీసుకున్నా.

 ‘అథర్వ’లో హీరోయిన్ల పాత్ర ఎలా ఉంటుంది?

క్లూస్ టీంలో హీరో పని చేస్తుంటాడు. హీరోయిన్ క్రైమ్ రిపోర్టర్. కథలో భాగంగానే రెండు పాత్రలుంటాయి. కథకు తగ్గట్టే ఉంటాయి. కావాలని హీరో హీరోయిన్ ట్రాక్ పెట్టలేదు.

IMG 20231124 WA0009

 ‘అథర్వ’ను అనుకున్న బడ్జెట్‌లోనే తెరకెక్కించారా? 

నిర్మాతలు ఈ కథను ముందుగా విన్నప్పుడు హీరో హీరోయిన్ల గురించి, టీం గురించి చెప్పలేదు. వారికి ఈ కథ నచ్చింది. ఎంతైనా పెట్టేందుకు ముందుకు వచ్చారు. సినిమా బాగా రావాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

 ‘అథర్వ’లో సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఏంటి?

శ్రీచరణ్ పాకాల ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నారు. ఆర్ఆర్ ఆయన అద్భుతంగా ఇస్తారు. మా అథర్వ సినిమాకు మంచి ఆర్ఆర్ ఇచ్చారు. పోలీస్ సైరన్ నుంచి కూడా ఓ మ్యూజిక్ పుట్టించారు. ఆర్ఆర్‌తో పాటు మాకు మంచి మాస్, రొమాంటిక్, ఫోక్ సాంగ్స్‌ కూడా ఇచ్చారు.

అథర్వ’ ఎలా ఉండబోతోంది? ఆడియెన్స్‌కు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?

 

సీటు అంచున కూర్చోబెట్టేలా ఎంతో గ్రిప్పింగ్‌గా సినిమా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఇష్టపడే ప్రేక్షకులే కాకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రమిది.

థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ మహేష్ గారూ,

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *