Anushka Shetty Thanks the audience: తెలుగు రాష్ట్రాల్లో ఈ గురువారం లేడీస్ కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ స్పెషల్ షో..

IMG 20230912 WA0098

 

నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ. ..యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకుందీ సినిమా. తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సినీ ప్రియులకు, ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కు థాంక్స్ చెప్పింది హీరోయిన్ అనుష్క. ఈ గురువారం ఏపీ తెలంగాణలో లేడీస్ కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ స్పెషల్ షో ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో

IMG 20230912 WA0099

హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ – అందరికీ నమస్కారం. మా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు థాంక్స్. మీ మెసేజెస్, ట్వీట్స్, ప్రేమ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ గురువారం ఏపీ తెలంగాణలోని థియేటర్స్ లో లేడీస్ కోసం మా మూవీ స్పెషల్ షో ప్రదర్శిస్తున్నాం. మీ ఇంట్లో చిన్నవాళ్లను, పెద్ద వాళ్లను ఈ స్పెషల్ షోకు తీసుకువెళ్లండి. మీ రెస్పాన్స్ కోసం వేచి చూస్తుంటాను. అని చెప్పింది.

IMG 20230908 WA0082

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *