AnthimaTheerpu Movie Trailer Launch: శ్రీకాంత్‌ చేతులమీదుగా ‘అంతిమ తీర్పు’ ట్రైలర్‌ విడుదల!

anthima teerpu trailer launch e1693407578790

కబాలి ఫేం సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్రామన్‌ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘అంతిమ తీర్పు’. శ్రీసిద్ధి వినాయక మూవీ మేకర్స్‌ పతాకంపై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఎ.అభిరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం కానుంది.

anthima teerpu trailer launch 2

ఈ ‘అంతిమ తీర్పు’ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్‌ తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.

anthima teerpu trailer launch 3

నిర్మాత డి.రాజేశ్వరరావు మాట్లాడుతూ ‘‘వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సాయిధన్సిక నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. అడగ్గానే మంచి మనసుతో మా సినిమా ట్రైలర్‌ విడుదల చేసిన శ్రీకాంత్‌గారికి కృతజ్ఞతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని అన్నారు.

anthima teerpu trailer launch 1

నటుడు దీపు, బండి రమేష్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రైలర్‌ విడుదల చేసిన శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాను ఆదరించాలని కోరారు.

Anthima teerpu

నటీనటులు:
సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్రామన్‌, సత్యప్రకాశ్‌, అమిత్‌ తివారీ, దీపు, నాగమహేశ్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కథ: మురళీ రమేశ్‌
కెమెరా: ఎన్‌ సుధాకరరెడ్డి,
సంగీతం: కోటి
ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌
కొరియోగ్రాఫర్‌: ఈశ్వర్‌ పెంటి
ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌ –దేవరాజ్‌
చీఫ్‌ కో డైరెక్టర్‌: బండి రమేష్‌
పీఆర్వో: మధు విఆర్‌
పబ్లిసిటీ డిజైనర్‌: సుజిత్‌ యాడ్స్‌
టీజర్‌ అండ్‌ ట్రైలర్‌ కట్స్‌: రామకృష్ణ కోనేరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *