“గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” లో వస్తున్న “తోడేలు” చిత్రం నుండి “అంతా ఓకేనా” వీడియో సాంగ్ వచ్చేసింది !

అంతా ఒకేనా సాంగ్ ఫ్రమ్ తోడేలు

 

“కాంతార” భారీ విజయం తరువాత “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ఇప్పుడు వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న “భేదియా” చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది.

తెలుగులో “తోడేలు” పేరుతో ఈ సినిమాను నవంబర్ 25 న భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేస్తుంది. ఇది వరకే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు సాంగ్స్ కు అనూహ్య స్పందన లభిస్తోంది.

తోడేలు పోస్టర్

తాజాగా ఈ “తోడేలు” చిత్రం నుండి “అంతా ఓకేనా” అనే వీడియో సాంగ్ ను విడుదలచేసారు. ఇందులో వరుణ్ ధావన్, అభిషేక్ బెనర్జీ మరియు పాలిన్ కబక్ గ్రూవీ ట్యూన్‌ని వినిపిస్తూ అరుణాచల్‌లోని నిర్మలమైన రోడ్ల గుండా డ్రైవింగ్ చేస్తున్నారు.

ఈ పాట ముగ్గురు స్నేహితుల మధ్య ఉన్న స్నేహాన్ని, బంధాన్ని చక్కగా చూపిస్తుంది. వారు ఉపయోగించే పాత మారుతీ 800 కూడా నాస్టాల్జియాను రేకెత్తిస్తుంది.

అంతా ఒకే నా సచిన్-జిగర్ స్వరపరచారు, సంతోష్ హరిహరన్, వేలు మరియు KJ అయ్యనార్ స్వరాలు అందించారు. ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య మరియు యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు.

మూడు సంచలనాత్మక చార్ట్‌బస్టర్‌ల తర్వాత, భేదియా యొక్క తాజా ట్రాక్ ఒక ప్రశాంతమైన ఆనందాన్ని కలిగిస్తుంది

జియో స్టూడియోస్ & దినేష్ విజన్ నిర్మిస్తున్న ‘భేదియా’ను.తెలుగులో తోడేలు పేరుతో “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా మెగా నిర్మాత అల్లు అరవింద్ నవంబర్ 25న విడుదలచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *