మూవీ: అన్ని మంచి శకునములే (Anni Manchi Shakunamule):
విడుదల తేదీ : మే 18, 2023
నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి, వెన్నెల కిషోర్
దర్శకులు : నందిని రెడ్డి
నిర్మాతలు: ప్రియాంక దత్
సంగీత దర్శకులు: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: జునైద్
అన్ని మంచి శకునములే రివ్యూ (Anni Manchi Shakunamule
Review):
యువ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం అన్నీ మంచి శకునములే. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక గా నటించింది.
ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ గురువారం విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో మా 18 f మూవీస్ టీం సమీక్షచదివి తెలుసుకుందామా !
కధ ను పరిశీలిస్తే (story line):
రెండు కుటుంబాల మధ్య ఓ కాఫీ ఎస్టేట్ గురించి కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. ఆ రెండు కుటుంబాల్లోని ఓ కుటుంబ వారసుడు ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) & రెండో కుటుంబానికి చెందిన వారసులు దివాకర్ (రావు రమేశ్), సుధాకర్ (సీనియర్ నరేష్). అయితే, రిషి (సంతోష్ శోభన్) సుధాకర్ కొడుకు, ఆర్య (మాళవికా నాయర్) ప్రసాద్ కుమార్తె.
ఇద్దరూ ఒకే రోజు పుడతారు. ఐతే ఓ నాటకీయ సంఘటన కారణంగా ఆస్పత్రిలో నర్సుల మధ్య జరిగిన మిస్ అండర్ స్టాండింగ్ వల్ల ఇద్దరు పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో, ఆయన కొడుకుగా రిషి… సుధాకర్ ఇంట్లో, ఆయన కుమార్తెగా ఆర్య పెరుగుతారు.
చిన్నతనం నుంచే వీరి మంచి స్నేహితులు. రిషి, ఆర్యని ఇష్ట పడతాడు. అయితే, ఆర్య కమర్షియల్ మైండ్ సెట్ లో ఉంటుంది.
మరి చివరకు రిషి ఆర్య లు ఎలా కలిశారు?,
రెండు కుటుంబాల మద్య ఉన్న కోర్టు కేసు ఏమైంది ?
అసలు వీరి పిల్లలు ఎందుకు మారి పోయారు ?
ఆసుపత్రి లో పిల్లలు మారిపోవడం వలన ఏమైనా జరిగిందా ?
అనేది మిగిలిన కథ.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
దర్శకురాలు నందిని రెడ్డి రెండు కుటుంబాలకి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కధనం ( స్క్రీన్ ప్లే) ను రాసుకోలేదు అనే చెప్పాలి.
హీరోహీరోయిన్ల మధ్య సాగే సీన్స్ కూడా చాలా స్లోగా సాగాయి. అలాగే వారి ప్రేమకు బలమైన పాయింట్ కూడా లేదు. దీనికి తోడు సెకండ్ హాఫ్ లో వీరి మధ్య అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. దీనికీ తోడు కొన్ని పాత చిత్రాల ప్రభావం కూడా ఈ చిత్రం పై ఎక్కువగా ఉంది.
ఈ స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో రెండవ అంకం ( సెకండ్ ఆఫ్) సాగుతుంది.
మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.
రెండవ అంకం (సెకెండాఫ్) ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకురాలు నందిని రెడ్డి బాగానే ప్రయత్నం చేశారు కానీ, ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో ఈ సినిమాని సాగదీశారు
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
నందిని రెడ్డి దర్శకత్వం లో వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమా ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ గా చెప్పవచ్చు. ఈ సినిమాలో కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ తో నందిని గారూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
హీరోగా సంతోష్ శోభన్ రిషి పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే ‘సంతోష్ శోభన్, మాళవిక నాయర్’ ల రెండు కుటుంబాల మధ్య కోర్టు కేసు, ఆ కేసుతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి అన్నీ మంచి శకునములే చిత్రం కొన్ని చోట్ల ఆకట్టుకుంది.
సంతోష్ శోభన్ తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రిషి పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు.
హీరోయిన్ గా నటించిన మాళవిక నాయర్ తన లుక్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది.
కీలక పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బాగుంది. ఓ బేబీ తర్వాత నందిని దర్శకత్వం లో రాజేంద్ర ప్రసాద్ గారూ అద్బుతంగా నటించారు.
మిగిలిన ప్రధాన పాత్రల్లో కనిపించిన సీనియర్ నరేష్, రావు రమేష్, గౌతమిలు కూడా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అలాగే, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్ కూడా చాలా బాగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాలో మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది.
జునైద్ ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు.
సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్ లు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు.
ముందే చెప్పుకున్నట్లు దర్శకురాలు నందిని రెడ్డి ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. ఇక సినిమా నిర్మాణం లో స్వప్న దత్ , ప్రియాంక దత్ ల ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
18F మూవీస్ టీం ఒపీనియన్:
ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’లో కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ సీన్స్ మరియు నటీనటుల నటన బాగున్నా స్లో నరేసన్ వలన బోర్ ఫీల్ వస్తుంది.
స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్, రెగ్యులర్ లవ్ డ్రామా వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని కొన్ని అంశాలు మాత్రమే కనెక్ట్ అవుతాయి. దియేటర్ లోకి వెళ్ళి చూసే అంత స్టఫ్ లేదు. 4 వారాలు ఆగితే ఇంట్లో కుర్చీని ఫ్యామిలీ అంతా హ్యాపీ గా చూడవచ్చు.
టాగ్ లైన్: స్లో గా సాగిన ఫ్యామిలీ డ్రామా !
18F Movies రేటింగ్: 2.5 / 5
* కృష్ణ ప్రగడ.