మూవీ : యానిమాల్ (Animal):
విడుదల తేదీ : డిసెంబర్ 01, 2023
నటీనటులు: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్ తదితరులు
దర్శకుడు : సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని
సంగీతం: JAM8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, హర్షవర్ధన్ రామేశ్వర్, అషిమ్ కెమ్సన్
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ
యానిమాల్ రివ్యూ (Animal Review):
యాంగ్రీ యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హిందీ లో రెండవ సినిమా గా యానిమాల్ టైటిల్ ప్రకటించిన తర్వాత యూజ్ బజ్ వచ్చింది. రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో నేషనల్ క్రస్ రస్మిక మందన హీరోయిన్ గా బాబీ డయోల్, అనిల్ కపూర్ తో చేసిన హై వోల్టాజ్ సిన్మా యానిమాల్ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ప్రపంచ సినీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్) కి తన తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే చిన్నప్పటినుండి పిచ్చి ప్రేమ. అయితే, బల్బీర్ సింగ్ ఇండియా లోనే టాప్ బిజీ బిజినెస్ మెన్. భారతదేశంలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహిస్తుంటాడు. ఆలాంటి బిజీ లైఫ్ లో తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతాడు. స్కూల్ టైమ్ లో జరిగిన సంఘటన తో తండ్రి బల్బీర్ రణ్ విజయ్ ని కొట్టి ఫ్యామిలీ కి దూరంగా పెట్టాలి అని చూస్తాడు.
ఈ క్రమంలో రణ్ విజయ్ సింగ్ కి – బల్బీర్ సింగ్ కి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో, కొడుకుని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రణ్ విజయ్ సింగ్, గీతాంజలి (రష్మిక)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాడు. ఐతే, బల్బీర్ పై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకుని, తిరిగి ఇండియాకి వస్తాడు.
అసలు బల్బీర్ సింగ్ ను చంపాలనుకుంది ఎవరు ?,
తన తండ్రికి ఉన్న శత్రువులపై విజయ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ?,
అందుకోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ?
చివరికి బల్బీర్ – రణ్ విజయ్ కలుస్తారా ? ఇద్దరు మద్య ఎందుకు దూరం పెరిగింది ?
రణ్ విజయ్ – గీతాంజలి మధ్య ప్రేమ – పెళ్లి ఎలా జరిగింది?
రణ్ విజయ్ లో అంత యంగర్ ఎలా వచ్చింది ?
వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే దియేటర్ కి వెళ్ళి సిన్మా వెంటనే చూడండి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
తండ్రి పై కొడుకికి ఉన్న పిచ్చి ప్రేమతో ఆ కొడుకు తన స్వంత భార్యను, పిల్లలను పక్కన పెట్టి తన తండ్రి కోసం ఏం చేశాడు అనే కోణంలో సాగిన ఈ సినిమాలో ఎమోషన్స్ తప్ప బలమైన కథ వస్తువు లేదు. ఇలాంటి కధ కు మంచి కధనం (స్క్రీన్ – ప్లే) వ్రాసుకొన్నా బాగుంటుంది. కానీ దర్శకుడు మనిషి లోపల ఉన్న ఎమోషన్ ని రెచ్చగొట్టి ఫీక్ స్టేజ్ లో బయటకి తీయడం అనే పాయింట్ మెదనే ప్లే నడుస్తుంది.
రణ్ విజయ్ తన తండ్రిని చంపడానికి చూసిన శత్రువులను కనిపెట్టడం తర్వాత ఎలా చంపాడు ? అనేదే ప్రధానమైన కథ – కధనం అయిపోయింది. దీనికితోడు కథలోని ప్రతి పాత్ర, ఆ పాత్రల తాలూకు ప్రతి ఎమోషన్ ఫోర్స్డ్ గానే ఉంటుంది. కొన్నిచోట్ల ఎమోషన్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాయనే ఫిల్ కలిగినా.. దాని కోసం ఈ పాత్ర ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది ? అనే అనుమానం కూడా సగటు సినీ ప్రేక్షకుడిని వెంటాడుతూ ఉంటుంది.
నిజానికి రణబీర్ కపూర్ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న సందీప్, అంతే స్థాయిలో ఈ యానిమల్ సినిమా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో సందీప్ రెడ్డి వంగ కొన్ని చోట్ల విఫలం అయ్యారు అని చెప్పాలి.
సందీప్ తన గత సినిమాలు అయిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ల శైలిలోనే ఈ యానిమాల్ సినిమాని కూడా రెగ్యులర్ ప్లేతోనే నడిపాడు. మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) ను ఇంటరెస్టింగ్ గా వేగంగా నడిపిన ఆయన రెండవ అంకం (సెకెండాఫ్) ని మాత్రం మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో సినిమా పై ఇంటరెస్ట్ పెంచటంలో విఫలమయ్యారు.
అసలు కథనే లేని ఈ యానిమాల్ సినిమా నే ఎక్కువ అనుకొంటే ఎండ్ టైటల్స్ లో మరో పార్ట్ యానిమాల్ – పార్క్ ఉంది అంటూ లీడ్ ఇవ్వడం చస్తే సందీప్ రెడ్డి మేకింగ్ స్టైల్ ఇదేనా అన్ని సిన్మా లు ఆయన అర్జున్ రెడ్డి శైలిలోనే ఉంటాయా అనిపిస్తుంది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన యానిమల్ కథా – కథనాలను రాసుకోలేకపోయారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.
రణబీర్ కపూర్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు డిఫెరెంట్ వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో రణ్ విజయ్ గా పాత్ర లో లీనమై చాలా బాగా నటించాడు. ముఖ్యంగా రణబీర్ తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.
మరో కీలక పాత్రలో ఫాదర్ గా నటించిన అనిల్ కపూర్ నటన ఆకట్టుకుంది. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామా కూడా బాగుంది. కొన్ని సీన్స్ లో ఎమోషనల్ గా, కొన్ని సీన్స్ లో అమాయకంగా అద్భుతమైన ఫేస్ ఎక్ష్ప్రెస్సెన్స్ తో మెప్పించాడు.
మరో కీలకమైన పాత్రలో కనిపించిన బాబీ డియోల్ కూడా చాలా వైల్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. తన బాడీ తో కూడా నటింపజేశాడు. కానీ సినిమా మొత్తంగా లేకుండా కొన్ని సీన్స్ కె పరిమితం చేయడం బాలేదు. యాక్టింగ్ పరంగా బాబీ డియోల్ గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు.
హీరోయిన్ గా రష్మిక మందన్నా మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేసింది. మరో హీరోయిన్ తృప్తి డిమ్రి నటన బాగుంది. కొన్ని బోల్డ్ సీన్స్ లో ఆమె తన గ్లామర్ తో సినిమాకి ప్లస్ అయ్యింది.
చారు శంకర్, శక్తి కపూర్ మరియు బబ్లూ పృథ్వీ రాజ్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
హర్షవర్ధన్ రామేశ్వ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యానిమాల్ సిన్మా కి చాలా హెల్ప్ అయ్యింది. చాలా పెద్ద సీన్స్ కూడా ఇంటరెస్టింగ్ గా ఉదగలుగుతున్నాము అంటే BGM వలనే. మిగిలిన సంగీత దర్శకులు అందించిన పాటలు పర్వాలేదు.
అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి విజువల్ క్వాలిటి బాగుంది.
సందీప్ రెడ్డి వంగ చేసిన ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. సినిమా నిడివి బాగా ఎక్కువైపోయింది.
నిర్మాతలు భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
సందీప్ వంగ ‘యానిమల్’ అంటూ హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా తీసిన సిన్మా లో రణబీర్ కపూర్ నటన, భారీ వైల్డ్ యాక్షన్ సీన్స్, బోల్డ్ ఎలిమెంట్స్ అండ్ హెవీ ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు.
దీనికితోడు రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో వయాలన్స్ ఎక్కువ అయ్యి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. నెవర్ సీన్ సీన్స్ గా ఉన్నా ప్రతి సీన్ ఎక్స్టెండ్ చేసినట్టుగా ఉన్నాయి. ఓవరాల్ గా యాక్షన్ మూవీ లవర్స్ ను మరియు రణబీర్ కపూర్ అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ఇంకా యానిమాల్ సినేమ స్ట్రిక్ట్లి పెద్దలకు మాత్రమే.. పిల్లలతో,యువకులతో, ఫ్యామిలీ తో కలిసి చూసే సినిమా కాదు.