బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న భారీ చిత్రం సాలార్. ఆ తర్వాత ఎంతో మంది వెయిట్ చేస్తున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా మన టాలీవుడ్ అర్జున్ రెడ్డి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన “యానిమల్” అని చెప్పాలి.
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ తర్వాత ఇండియా లెవెల్ లో మంచి బజ్ ని సెట్ చేసుకొని గ్రాండ్ గా రిలీజ్ కావడానికి రెఢీ అయ్యింది. అయితే ఈ యానిమల్ చిత్రానికి ఊహించని విధంగా ఓ షాకింగ్ వార్తా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

అది ఏమిటంటే యానిమాల్ మూవీ రన్ టైమ్. ప్రస్తుతం ఉన్న రూమర్ ఏంటంటే మూడున్నర గంటలు రన్ టైమ్ లాక్ చేసారని అంటున్నారు. కానీ ఈ వార్తా లో ఎలాంటి నిజం లేదు అని చిత్ర యూనిట్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. అయితే ఇప్పుడు ఫైనల్ రన్ టైం కి సంబంధించి బాలీవుడ్ వర్గాలు నుంచి క్లారిటీ తెలుస్తుంది.
బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ సమాచారం ప్రకారం ఈ యానిమల్ చిత్రం ఫైనల్ రన్ టైమ్ గా మూడు గంటల 10 (190 మినిట్స్) నిమిషాలుగా కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా చెప్తున్నాడు. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక క్లారిటీ త్వరలోనే రానుంది.

ఇక ఈ యానిమాల్ చిత్రానికి తెలుగు వాడైన మ్యూజిక్ డైరెక్టర్ హర్ష వర్ధన్ రామేశ్వర్ స్కోర్ అందించగా టి సిరీస్ వారు నిర్మాణం వహించారు. ఈ చిత్రం వర్క్ అంతా పూర్తి అయిన తర్వాత సందీప్ వంగా ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమా వర్క్ మీద దృస్తి పెట్టబోతున్నట్టు సమాచారం.