Ananya Movie Pre Release highlights : ఘనంగా “అనన్య” ప్రి – రిలీజ్ వేడుక ! రిలీజ్ ఎప్పుడంటే!

IMG 20240314 WA0099 e1710409515866

జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో… శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకం ప్రారంభ చిత్రంగా జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించిన విభిన్న కథా చిత్రం “అనన్య”. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది.

IMG 20240306 WA00681

ఈ నేపధ్యంలో “అనన్య” ప్రి రిలీజ్ వేడుకను హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు సుమన్, యువ కథానాయకుడు సందీప్ మాధవ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రముఖ దర్శకనిర్మాత సాయి వెంకట్, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, శ్రీనివాస్ బోగిరెడ్డి, యువ దర్శకుడు అఫ్జల్ తోపాటు యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “అనన్య” అద్భుత విజయం సాధించాలని ఈ సందర్భంగా అతిధులు అభిలషించారు.

IMG 20240314 WA0100

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న “అనన్య” అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ “శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్”కు శుభా రంభాన్నిస్తుందని  నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు.

సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న “అనన్య” ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.

IMG 20240314 WA0098

 

సీతా శ్రీనివాస్, శివాని శర్మ, చక్రవర్తి, జబర్దస్త్ అప్పారావు, పొట్టి చిట్టిబాబు, సుజాత, క్రాక్ శ్రీమణి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, డాన్స్: బ్రదర్ ఆనంద్ – బాలు, మాటలు: హరికృష్ణ – వెంకట రమణ బొమ్మిన, ఫైట్స్: దేవరాజ్, పాటలు: త్రినాధ్ మంతెన – నవీన్ విల్లూరి, మ్యూజిక్: త్రినాద్ మంతెన, కెమెరా: ఎ.ఎస్.రత్నం, ఎడిటింగ్: నందమూరి హరి, సహ నిర్మాత: బుద్ధాల సత్యనారాయణ, సమర్పణ; శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి, నిర్మాత: జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ప్రసాద్ రాజు బొమ్మిడి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *