Ananya Movie Pkster Launched by Srikanth -‘అనన్య’ ప్రచార చిత్రం విడుదల చేసిన కథానాయకుడు శ్రీకాంత్ !

IMG 20240306 WA0070

జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో… శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకం ప్రారంభ చిత్రంగా జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించిన విభిన్న కథా చిత్రం “అనన్య”.

హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో “అనన్య” ప్రచార చిత్రాన్ని శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఆవిష్కరించి, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు!!

IMG 20240306 WA0071

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ “శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్”కు శుభారంభా న్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు.

సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న “అనన్య” ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు!!

IMG 20240306 WA0068

 

నటి నటులు:

సీతా శ్రీనివాస్, శివాని శర్మ, చక్రవర్తి, జబర్దస్త్ అప్పారావు, పొట్టి చిట్టిబాబు, సుజాత, క్రాక్ శ్రీమణి ఇతర పాత్రలు పోషించారు.

సాంకేతిక నిపుణులు: 

ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, డాన్స్: బ్రదర్ ఆనంద్ – బాలు, ఫైట్స్: దేవరాజ్, మ్యూజిక్: త్రినాద్ మంతెన, కెమెరా: ఎ.ఎస్.రత్నం, ఎడిటింగ్: నందమూరి హరి, సహ నిర్మాత: బుద్ధాల సత్యనారాయణ, సమర్పణ; శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి, నిర్మాత: జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ప్రసాద్ రాజు బొమ్మిడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *