Anand Devarakonda Launchs Prema Kadha Movie Song   “ప్రేమకథ” సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్  రిలీజ్ చేసిన హీరో ఆనంద్ దేవరకొండ !

prema kadha anand e1699108675558

కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ప్రేమకథ”. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహిస్తున్నారు. “ప్రేమకథ” సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఎవడు మనోడు…’ను హీరో ఆనంద్ దేవరకొండ రిలీజ్ చేశారు. పాట వినగానే ఆకట్టుకుందని, ఈ సాంగ్ ఛాట్ బస్టర్ కావాలని తన బెస్ట్ విశెస్ అందించారు ఆనంద్ దేవరకొండ.

prema kadha poster

‘ఎవడు మనోడు…’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రధన్ కంపోజ్ చేయగా..రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. సీవీ సంతోష్ పాడారు. ‘ఎవడు మనోడు, ఎవడు పగోడు ..కాలం ఆడుతుంది చూడు వింత చెడుగుడు. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు..కత్తి దూస్తు ఉంది చూడు పంతమిప్పుడు..’ అంటూ అగ్రిసెవ్ కంపోజిషన్ తో…రివేంజ్ మోడ్ లో సాగుతూ ఆకట్టుకుంటోందీ పాట.

prema kadha 2

వైవిధ్యమైన లవ్ స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు శివశక్తి రెడ్ డీ. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న “ప్రేమకథ” చిత్రాన్ని త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

prema kadha 1

నటీనటులు:

కిషోర్ కేఎస్డి, దియా సితెపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు తదితరులు

టెక్నికల్ టీమ్: 
డీవోపీ – వాసు పెండెం, మ్యూజిక్ – రధన్, ఎడిటర్ – ఆలయం అనిల్, ఆర్ట్ డైరెక్టర్ – వీర మురళి, కాస్ట్యూమ్స్ – శివాని ఎర్ర,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – గిరి పిన్నింటి, లైన్ ప్రొడ్యూసర్స్ – ఈ. శ్రీనివాస్ గౌడ్, ఎం.హనుమంత్ రెడ్డి, చందు కొదురుపాక,
లిరిక్స్ – కృష్ణ చైతన్య, రాంబాబు గోసాల, కృష్ణ కాంత్, బ్యానర్స్ – టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పి, సినీ వ్యాలీ మూవీస్,
నిర్మాతలు – విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్, కో ప్రొడ్యూసర్ – ఉపేందర్ గౌడ్ ఎర్ర,
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా, రచన దర్శకత్వం – శివశక్తి రెడ్ డీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *