సంక్రాంతి 2026 బరిలో నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’! 

IMG 20250526 WA0146 e1748270688642

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వినోదభరిత చిత్రం ‘అనగనగా ఒక రాజు‘ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది.

తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బ్లాక్ బస్టర్ మెషిన్ నవీన్‌ పొలిశెట్టి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.

  ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్‌ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్ తోనే అర్థమైంది.

తెలుగు సినీ అభిమానులు సంక్రాంతి పండుగను సినిమా పండుగలా భావిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుంది.

IMG 20250526 201403

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’లో నవీన్‌ పొలిశెట్టికి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులను సరికొత్త వినోదాన్ని అందించేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. పండుగ రుచికి సరిగ్గా సరిపోయేలా ఆయన తనదైన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలు కొన్నేళ్లుగా వరుస ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2026 సంక్రాంతికి ‘అనగనగ ఒక రాజు’తో మరో పండగ విజయాన్ని ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

తారాగణం:

నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి,

సాంకేతిక నిపుణులు: 

ఛాయాగ్రహణం: జె. యువరాజ్, సంగీతం: మిక్కీ జె. మేయర్, దర్శకత్వం: మారి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *