NANDAMURI KALYAN RAM: నందమూరి టాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ [చిత్రం “అమిగోస్” (AMIGOS)
డోప్లాంగర్స్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ సక్సెస్ ని అందుకోలేకపోయింది. కానీ చూసిన కొద్ది మందిలో కూడా చాలా మందికి నచ్చింది అని టాక్ ఉంది.
ఇక ఈ అమీగోస్ సినిమా థియేటర్ రిలీజ్ నుండి ఓటిటి స్ట్రీమింగ్ కి రావడానికి చాలా సమయం తీసుకుంది అని చెప్పాలి. ఈ అమీగోస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు ప్రపంచ దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకొన్నారు.
ఈ అమీగోస్ చిత్రం ఈరోజు (ఏప్రిల్ 1 st ) నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు థియేటర్స్ లో ఎవరైనా ఈ సినిమా మిస్ అయ్యి ఉంటే ఈసారి చూసి ఇంట్లో నో ఆఫీసు లోనో కూర్చుని చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు.
ఇక ఈస్ట్రాంగ్ థ్రిల్లింగ్ అమీగోస్ సినిమాకి అయితే జిబ్రాన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. చూసి ఆనందించండి.