సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీగా అవార్డ్ గెల్చుకుంది “అంబాజీపేట మ్యారేజి బ్యాండు“. సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ సినిమా మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసే ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. థియేట్రికల్ సక్సెస్ తో పాటు ఓటీటీలోనూ ఆదరణ పొందింది.
“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ గెల్చుకోవడం వెల్ డిసర్వ్ డ్ అనే ప్రశంసలు దక్కుతున్నాయి.
“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.
దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి విజయాన్ని సాధించింది.