Ambajipeta Marriage Band Teaser update ఈ నెల 9న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా టీజర్ రిలీజ్ ! 

IMG 20231005 WA0050

 

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 9న రిలీజ్ చేయబోతున్నారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా లీడ్ యాక్టర్స్ అందరూ ఉన్న పోస్టర్ రివీల్ చేశారు.

IMG 20231004 WA0152

పూర్తిగా  కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉందీ సినిమా. త్వరలోనే థియేటర్స్ ద్వారా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నటీనటులు :

సుహాస్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్,జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు

సాంకేతిక నిపుణుల: 

సంగీతం – శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్,

ఎడిటింగ్ – కొదాటి పవన్ కల్యాణ్

పీఆర్వో – జీఎస్ కే మీడియా, ఏలూరు శ్రీను

బ్యానర్స్ – జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్

రచన దర్శకత్వం – దుశ్యంత్ కటికినేని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *