Amazon Telugu Movie Original update: అక్టోబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానున్న గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్ “అమ్ము”

ammu amazon prime new

 

ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ (PS-1)లో తన పూంగుజాలి పాత్రతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తన రాబోయే చిత్రం “అమ్ము” లో కనిపించనుంది.‘అమ్ము’, గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్ గా అక్టోబర్ 19న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

amazon originals release

ఈ సంధర్బంగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో.

“నా పేరు అమ్ము, మా ఇంట్లో అడిగితే అమ్ము అంటేనే అల్లరి పిల్ల అని చెప్తారు, అమ్మ ఏమో ఒసేయ్ నీకు వెంటనే పెళ్లి చేసేయాలే అనేది, నాన్నమో అప్పుడే నా ముద్దుల తల్లికి పెళ్లా అని మురిసిపోయేవారు, మరి నేనేమో అందరి అమ్మాయిలలానే ఎప్పుడెప్పుడు నా రాకుమారుడు చేయి పట్టుకుని రంగుల ప్రపంచంలో విహరిద్దామా అని కలలు కనేదాన్ని ..

ammu 1
అని కూల్ గా స్టార్ట్ ఈ టీజర్, ఒక్కసారిగా “అమ్ము” పిలుపుతో సినిమాపై ఆసక్తిని కలిగించింది. రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే ఈ చిత్రం ఒక డ్రామా థ్రిల్లర్ అని తెలుస్తోంది.

కార్తీక్ సుబ్బరాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, చారుకేష్ శేఖర్ రచన & దర్శకత్వం మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించిన…

ammu amazon original 1

ఈ డ్రామా థ్రిల్లర్‌లో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర మరియు సింహా నటించారు.

అమ్ము సినిమా తెలుగు తో పాటు తమిళం,  మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *