వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ని ఈ రోజు ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించారు.
ఈ ఫ్యామిలీ కార్నివాల్ గ్రాండ్ గా చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది.
ఈ కార్నివాల్ కి ముఖ్య అతిధి గా వచ్చిన అల్లు అర్జున్ అల్లు స్నేహ రెడ్డి కి, నాగు రెడ్డి మరియు స్మిత రెడ్డి కి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ : పుష్ప షూట్ మధ్యలో నుంచి వచ్చాను. ఈ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అల్లు స్నేహ రెడ్డి, నాగు రెడ్డి మరియు స్మిత రెడ్డి కి అభినందనలు.
అలాగే ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీడియాకి మా అల్లు ఫ్యామిలీ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ కార్నివాల్ కి ప్రధాన భాగస్వామి గా వ్యవరిస్తున్న పికాబు సంస్థ ఫౌండర్ స్నేహ రెడ్డి మా 18F మీడియా ప్రతినిధి తో మాట్లాడుతూ ఇలాంటి ఫ్యామిలీ కార్నివాల్ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరపడానికి ప్లాన్ చేస్తున్నాము అని చెప్పారు.