ALLU ARJUN RECEIVES CNN-NEWS18’S INDIAN OF THE YEAR-2022 AWARD:”ఇండియన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

allu arjun Indian year of the year 2022

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ పుష్ప: ది రైజ్ విజయంతో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సత్తాను అంతటా చూపించాడు. అల్లు అర్జున్ సాధించిన విజయాలు నిజంగా తిరుగులేనివి.

న్యూయార్క్‌లో జరిగే వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో భారతదేశానికి గ్రాండ్ మార్షల్‌గా ప్రాతినిధ్యం వహించడం, పుష్ప: ది రైజ్ SIIMAలో ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును గెలుచుకోవడం, ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ బిరుదును అందుకున్నాడు.

allu arjun with cnn news18 award

అల్లు అర్జున్ బహుభాషా పుష్ప: ది రైజ్‌లో తన అద్భుతమైన నటనకు బుధవారం ఎంటెర్టైనమెంట్ విభాగంలో CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ల తర్వాత ఉత్తరాదికి  చెందిన నేషనల్ నెట్వర్క్ ద్వారా  దక్షిణ భారత నటుడికి ఇదే తొలి అవార్డు.

allu arjun and smrithi e1665772277961

ఢిల్లీలో అల్లు అర్జున్‌కు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అవార్డును అందజేశారు. అవార్డును స్వీకరించే సమయంలో,తన విలక్షణమైన శైలిని ప్రదర్శించారు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ అవార్డును స్వీకరిస్తూ, “భారతీయ సినిమా, ఇండియా కభీ ఝుకేగా నహిం (భారతీయ సినిమా, భారతదేశం ఎప్పటికీ తగ్గేదేలే)” అని పుష్ప రాజ్ చెప్పిన డైలాగ్‌ను అల్లు అర్జున్ తనదైన శైలిలో మరోసారి చెప్పారు.
allu arjun with award
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నేను దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నాను, ఉత్తరాది నుంచి అవార్డులు అందుకోవడం ఇదే తొలిసారి కాబట్టి ఇది నాకు చాలా ప్రత్యేకం’’ అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ మాటలకు మంచి స్పందన లభించింది.

allu arjun and smrithi 1 e1665772336596

పుష్ప: ది రైజ్‌చిత్రం మహమ్మారి సమయంలో విడుదలైనందున, అల్లు అర్జున్ ఈ అవార్డును డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు వాలంటీర్లు వంటి “COVID వారియర్స్”కి అంకితం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *