Allu Arjun grace the Mangalavaaram Pre release event: అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ !

IMG 20231109 WA0158 e1699531269323

 

‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం‘ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది.

IMG 20231018 WA0050

నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘మంగళవారం’ సినిమా విడుదల కానుంది. ఈ నెల 11న… శనివారం హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ ఫంక్షన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. అల్లు ఆర్మీ, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది.

IMG 20231021 WA00571

‘మంగళవారం’ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. సినిమాలో మూడు పాటలను కూడా విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభిస్తోంది. ‘ఆర్ఎక్స్ 100’ తరహాలో మరోసారి డిఫరెంట్ కంటెంట్ అండ్ కమర్షియల్ బేస్డ్ సినిమాతో అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనే నమ్మకం ప్రేక్షకులలో కలిగించింది. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.

IMG 20231021 WA01141

పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, మ్యూజిక్ : ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి, ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి,  ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, పృథ్వీ, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ రాజా కృష్ణన్, కొరియోగ్రఫీ : భాను, కాస్ట్యూమ్ డిజైనర్ : ముదాసర్ మొహ్మద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : అజయ్ భూపతి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *