Ala Ninnu Cheri Movie Review & Rating: ఎలా ప్రేక్షకులను చేరిందో.. ఈ అలా నిన్ను చేరి చిత్రం ?

Ala ninnu Cheri review by 18f movies 9 e1699733006121

  మూవీ : అలా నిన్ను చేరి (Ala Ninnu Cheri Review) 

విడుదల తేదీ : నవంబర్ 10, 2023

నటీనటులు: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర, శత్రు తదితరులు.

దర్శకుడు : మారేష్ శివన్

నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్

సంగీతం: సుభాష్ ఆనంద్

సినిమాటోగ్రఫీ: ఆండ్రూ

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

మూవీ రివ్యూ: అలా నిన్ను చేరి తెలుగు రివ్యూ (Ala Ninnu Cheri Movies) 

హుషారు, ప్లే బాక్ చిత్రాల ద్వారా దినేష్ తేజ్ సినీ ప్రేక్షకులందరికి పరిచేయమే. మరి ఇప్పుడు దినేష్ తేజ్  హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అలా నిన్ను చేరి. ఇటీవల టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ ఈ శుక్రవారం  మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది మా 18F మూవీస్ టీం  సమీక్షలో చూద్దామా !.

Ala ninnu Cheri review by 18f movies 5

కధ పరిశీలిస్తే (Story Line): 

పట్నం లో చదువుతూ సెలవలకు తన  ఊరు వచ్చిన  అమ్మాయి అయిన దివ్య (పాయల్ రాధాకృష్ణ) ని చూసిన అనంతరం గణేష్ (దినేష్ తేజ్) ఆమెతో ప్రేమలో పడతాడు, కాలక్రమేణా వారిద్దరి మధ్య ప్రేమ అన్యోన్యంగా మారుతుంది. అయితే వారిద్దరి వివాహాన్ని ఒప్పుకోని ఆమె తల్లి (ఝాన్సీ) తనకు వేరొక అబ్బాయితో వివాహాన్ని చేయడానికి ప్రయత్నించినప్పుడు దివ్య గణేష్‌తో పారిపోవాలని ఆలోచిస్తుంది.

అయితే, తనకు ఉన్న ఒక లక్ష్యం కారణంగా గణేష్ ఒప్పుకోడు. అయితే రేపు జరిగే నా పెళ్ళికి వచ్చి పెళ్లి మొత్తం చూసి వెళ్లిపో.. ఇంక ఎప్పుడూ నా జీవితం లో కనిపించకూ అని దివ్య చెప్తుంది,

ఇలాంటి సంధర్బం లో గణేష్ ఏమి చేశాడు ?

దివ్య పెళ్లి జరిగిందా లేదా ?  తరువాత ఏమి జరుగుతుంది?

దివ్యని గణేష్ పెళ్లి చేసుకున్నాడా? , అసలు గణేష్ లక్ష్యం ఏమిటి ?

గణేష్ లక్ష్య సాధన లో  అను (హెబ్బా పటేల్) ఎలా ప్రవేశించింది ?

అను ఎవరు ? ఎందుకు దినేష్ తో కలిసి ఉంది ?

చివరకు గణేష్ ప్రయాణంలో అను పాత్ర ఏమిటి ? 

అనే వాటికి సమాధానాలు తెలియాలి అంటే ఈ అలా నిన్ను చేరి మూవీ దియేటర్ కి వెళ్ళి  చూడాల్సిందే.

కధనం పరిశీలిస్తే (Screen – Play) : 

Ala ninnu Cheri review by 18f movies 3

ముఖ్యంగా ఈ సినిమాకి ప్రధానంగా మిస్టేక్ ఏమిటంటే కథనాన్ని (స్క్రీన్ – ప్లే) ఆడియన్స్ ని ఆకట్టుకునే రీతిన దర్శకుడు ఇంటరెస్ట్ గా రాసుకోలేకపోవడం. తెలుగు సినిమాల్లో ఏళ్ల తరబడి చూసిన కథ, కథాంశం ఉన్నప్పటికీ, దర్శకుడు మరింత ఆకర్షణీయమైన కధనం (స్క్రీన్‌ప్లే) తో సరికొత్త ఆలోచనతో దానిని ప్రేక్షకులకి చేర్చలేక చేయలేకపోయాడు.

సెకండ్ హీరోయిన్ అయిన హెబ్బా పటేల్పాత్ర తో సినిమా కి కొంచెం గ్లామర్ జోడించారుకానీ  ఆమె నటించిన కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంత ఇబ్బందికరంగా మరవచ్చు. డైలాగ్‌లు నార్మల్ గానే ఉన్నాయి కానీ కొన్ని డైలాగులు అయితే ఉద్దేశపూర్వకంగా పెద్దలని ఉద్దేశించి రాశారా అనిపిస్తుంది. ఇవి ఫ్యామిలీ ఆడియన్స్‌కి అంతగా నచ్చకపోవచ్చు. పాటలు ట్యూన్ పరంగా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, రెండు ట్రాక్‌లలో అర్ధవంతమైన సాహిత్యం లేదు.

మహేష్ ఆచంట పాత్రకు మరింత డెప్త్ ఇచ్చి ఉండి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక చమ్మక్ చంద్ర పాత్ర మరి నాశిరకంగా ఉంది. ప్రస్తుత ఐటి ఆఫీసు లలో అలాంటి మేనేజర్స్ అసలు ఉండరు. ఈ పాత్ర చాలా హార్ట్ఫిషియల్ గా ఉంది.   అనవసరం అనిపిస్తుంది. పలు సన్నివేశాలు బలవంతంగా జొప్పించినవిగా అనిపిస్తాయి,

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

Ala ninnu Cheri review by 18f movies 8

దర్శకుడు మారేష్ శివన్ ఈ సినిమాను ఎఫెక్టివ్ గా ప్రేక్షకులకు ప్రెసెంట్ చేయడంలో కొంచెం తడబడ్డాడు అనిపిస్తుంది. మంచి ట్విస్ట్ ఉన్న స్క్రిప్ట్ అయినా మధ్యలో వచ్చే  సన్నివేశాలను మెరుగైన కధనం ( స్క్రీన్‌ప్లే) మరియు ఆకర్షణీయమైన సంభాషణలతో ఇంకా బాగా చేయవచ్చు, కానీ దానికి బదులుగా మూవీలో అనవసరమైన సన్నివేశాలు మరియు అస్పష్టమైన భాషతో నింపేయడం వలన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూస్తున్నమా లేక వోల్గర్ సినిమా చూస్తున్నమా అనిపిస్తుంది.

హీరో దినేష్ తేజ్ మరొక్కసారి గణేష్ పాత్రలో ఆకట్టుకునే పెరఫార్మన్స్ కనబరిచారు. ముఖ్యంగా పలు సీన్స్ లో అతడు కనబరిచిన నటనతో పాటు డ్యాన్స్ వంటివి కూడా ఎంతో బాగున్నాయి. ఈ అలా నిన్ను చేరి అయితే దినేష్ కి మంచి సినిమా నే అని చెప్పవచ్చు. నటన పరంగా బాగా చేశాడు.

హీరోయిన్ గా నటించిన పాయల్ రాధాకృష్ణ కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు అందం, అభినయంతో అలరించింది.

Ala ninnu Cheri review by 18f movies 1

మరో హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా తన పాత్ర మేరకు బాగానే నటించింది కానీ కొంత స్కిన్ షో ఎక్కువ అయ్యిందా అనిపిస్తుంది. మంచి లవ్ స్టోరీ లవ్ ఆ పాత్ర పరిధికి మించి గ్లామర్ షో చేసిందా అనిపిస్తుంది.

మహబూబ్ బాషా తాను పోషించిన పాత్రలో కామెడీతో కొంత వరకు ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు వారి వారి పాత్రలలో సంతృప్తికరమైన నటనను ప్రదర్శించారు.

Ala ninnu Cheri review by 18f movies

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

సుభాష్ ఆనంద్  సంగీతం యావరేజ్‌గా ఉంది. ట్యూన్స్ అంతగా ఆకట్టుకోలేదు. బాక్ గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఒకే అనేలా ఉంది.

ఆండ్రూ అందించిన సినిమాటోగ్రఫీ  కూడా ఒకే అనెలనే ఉంది.

కోటగిరి వెంకటేశ్వరరావు సినియర్ ఎడిటర్ అయినప్పటికీ ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ బోర్ కొట్టేలా ఉన్న చాలా సీన్స్ ట్రిమ్ చేసి ఉండొచ్చు. కొంచెం లెంత్ తగ్గించి ఉంటే బాగుండేది.

కొమ్మాలపాటి సాయి సుధాకర్ కి ఈ చిత్రం  తొలి నిర్మాణం అయినప్పటికీ, మూవీని గ్రాండ్ గానే నిర్మించారు. సినిమా రిచ్ నెస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

Ala ninnu Cheri review by 18f movies 2

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

మొత్తం మీద, అలా నిన్ను చేరి మూవీ కొంతమంది ప్రేక్షకులను మెప్పించినా ఓల్డ్ ఫార్మాట్  స్క్రీన్ ప్లే తో సాగే ప్రేమ కథా చిత్రం. హీరో గా దినేష్ తేజ్ తన పాత్రలో రెండు షడ్స్ తో  ఆకట్టుకునే నటన కనబరిచినప్పటికీ, మూవీలో అనవసరమైన సన్నివేశాలు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే కంటెంట్‌తో లేకపోవడంతో పాటు ప్రస్తుతం యూత్ కోరుకొనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లకపోవడం కొంచెం మైనస్ లా ఉంది. కానీ ప్రతి ప్రేమికుడికి వెదురుపడే సమస్య నే కెరియర్ నా అమ్మాయి నా అనే పాయింట్.

చివరి మాట: యువత తల్లితండ్రులు మెచ్చే చిత్రం !

18F RATING: 2.75 / 5

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *