Akshay Kumar Wraps Up His Part for Vishnu Manchu’s Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ షూట్ పూర్తి చేసిన అక్షయ్ కుమార్ 

Akshay Kumar Wraps Up His Part For Vishnu Manchus Kannappa scaled e1714734186421

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది.

అక్షయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ తన షూటింగ్‌ను ముగించుకున్నాడు. విష్ణు మంచు ఈ మేరకు వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘అక్షయ్‌కుమార్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నో సార్లు కలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

“కన్నప్ప” సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను పెంచనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *