నటి పావలా శ్యామలకు ధన సాయం అందించిన ఆకాష్ జగన్నాథ్!

IMG 20250119 WA00241 e1737274116158

ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్. ఘట్ కేసర్ లోని ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ సొసైటీలో ఆశ్రయం పొందుతోంది పావలా శ్యామల.

ఆమె పరిస్థితి తెలుసుకున్న ఆకాష్ జగన్నాథ్..అక్కడికి వెళ్లి ఆర్థిక సాయం అందించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తనకు సాయం చేసిన ఆకాష్ కు పావలా శ్యామల కృతజ్ఞతలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఆకాష్ జగన్నాథ్ మంచి మనసుకు ఈ సాయం నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆకాష్ తల్వార్ అనే మూవీలో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *