అజిత్ లేటెస్ట్ సినిమా తెగింపు రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. త్వరలోనే తెగింపు సినిమా తెలుగు ట్రైలర్ విడుదల !

ajith tegimpu stills e1671804262392

తెలుగు రాష్ట్రాలలో  సంక్రాంతికి విడుదలకుమన తెలుగ సూపర్ స్టార్స్ సినిమాలలో పాటూ తమిళ సూపర్ స్టార్స్ సినిమాలు కూడా  వరుసలో ఉన్నాయి. ఈ సంక్రాంతి  పండుగ సీజన్‌లో తెరపైకి వచ్చే డబ్బింగ్ సినిమా లలో పెద్ద చిత్రాలలో ఒకటి అజిత్ యొక్క తెగింపు (తమిళ – తునివు).

ajith tegimpu stills

ఈ సినిమా తెలుగులో తేగింపు అని, తమిళ లో తునివు పేరుతో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇప్ప‌టికే ఈ అజిత్ తెగింపు సినిమా నుండి తమిళ్ లో  రెండు పాట‌లు విడుద‌ల‌ కాగా మూడో పాట‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

ajith

ఈ సినిమా దర్శకనిర్మాతలు సెన్సార్ కి పంపడానికి  రన్‌టైమ్‌ను లాక్ చేసిందనేది ఇప్పుడున్న సోషల్ మీడియా  బజ్. మాలు అందుతున్న  కొన్ని నివేదికల ప్రకారం, ఈ తెగింపు సినిమా  హీస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కి  147 నిమిషాల నిడివితో ఉంటుంది అనేది చెన్నై  టి – నగర్ సమాచారం .

ajith tegimpu photo e1671804189139

అజిత్ కుమార్ తో బోని కపూర్ నిర్మించిన  నేర్కొండ పార్వై, వలిమై తర్వాత ఇది మూడో సినిమా. అజిత్  హెచ్.వినోత్‌కి కూడా  ఇది మూడో సినిమా. అంటే బోని కపూర్, అజిత్ మరియు h వినోద్ త్రయం నుండి వస్తున్న మూడో సినిమా.

AJITH new film tegimpu scaled e1671804145239

ఇంకా ఈ సినిమా లో మంజు వారియర్ కీలక పాత్ర పోషిస్తుండగా, సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తెగింపు చిత్రానికి  జిబ్రాన్  సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై తమిళనాట  భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి తెలుగు ప్రేక్షకులు అజిత్ తెగింపు కి ఎన్ని మార్కులు వేస్తారో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *