ఆహా లో ‘హోం టౌన్’ ! స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే!

IMG 20250310 WA0048 e1741595502276

ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు.

ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ఈ రోజు హోం టౌన్ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. ఇంకా ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులో లేని 2000 సంవత్సరంలో ఓ అందమైన గ్రామం నేపథ్యంగా ఈ సిరీస్ కథ సాగుతుంది. హోం టౌన్ టీజర్ కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుంది. ఇంటర్నెట్ మొదలైన ఎర్లీ డేస్ లో సోషల్ మీడియా అంటే తెలియక ముగ్గురు విద్యార్థులు చేసిన ఫన్ నవ్వించింది.

స్కూల్ లైఫ్ లో విద్యార్థులు చేసే సరదా పనులు, అప్పుడే మొదలయ్యే ప్రేమలు..వంటి అంశాలతో ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా హోం టౌన్ టీజర్ ఉంది. ఈ వెబ్ సిరీస్ ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు.

ఈ సిరీస్ కు సినిమాటోగ్రాఫర్ గా దేవ్ దీప్ గాంధీ కుండు పనిచేయగా..సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *