ఆహా ‘డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’ – ఎలిమినేషన్ అప్ డేట్!

IMG 20250301 WA0122 e1740839194598

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో ‘డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్‘ ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తోంది. మూడో ఎపిసోడ్ లో మెస్మరైజింగ్ పర్ ఫార్మెన్స్ ల తర్వాత ఫ్రైడే ఎలిమినేషన్ లో కంటెస్టెంట్ షోనాలి, మెంటార్ జాను లైరి ఎలిమినేట్ కావడం వ్యూయర్స్ ను షాక్ కు గురిచేసింది. డాన్స్ ఐకాన్ సీజన్ 2లో ఇది ఫస్ట్ ఎలిమినేషన్ కావడం విశేషం.

IMG 20250301 WA0124

షోనాలి, జాను లైరి స్టేజ్ నుంచి వెళ్లిపోతున్న సందర్భంలో అంతా ఎమోషనల్ అయ్యారు. దీనికి తోడు ఫేవరేట్ కంటెస్టెంట్ బర్కత్ అరోరా అనారోగ్య కారణాలతో షోలో పాల్గొనలేకపోయింది. ఆమె స్థానంలో వర్తికా ఝా పాల్గొంటున్నట్లు హోస్ట్ ఓంకార్ ప్రకటించి సర్ ప్రైజ్ చేశాడు.

వర్తికా ఝా తన ఎలక్ట్రిఫైయింగ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇవే కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆశ్చర్యపరిచేందుకు రెడీ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *