ఏజెంట్ తెలుగు రివ్యూ: బోరింగ్ కధనం తో సాగే వైల్డ్ స్పై యాక్షన్ ఏజెంట్ సినిమా

agent review e1682703427119

మూవీ: ఏజెంట్ (AGENT MOVIE)

విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023

నటీనటులు: అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డైనో మొరె, సాక్షి వైద్య తదితరులు

దర్శకులు : సురేందర్ రెడ్డి

నిర్మాతలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్

సంగీత దర్శకులు: హిప్ హాప్ తమిజా

సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్

ఎడిటర్: నవీన్ నూలి

ఏజెంట్ సినిమా రివ్యూ (AGENT Movie Review):

మా అక్కినేని ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది కానీ నాకు యాక్షన్ సినిమాలు అంటేఇస్టం అది ఎందుకు ఎలా వచ్చింది అంటే చెప్పలేను అని మొన్న  అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ప్రెస్ మీట్ లో చెప్పేశారు. అంతే కాదు… ‘ఏజెంట్’ (Agent Movie) కోసం వైల్డ్ యాక్షన్ హీరోగా మారడానికి ఓక సంవత్సరం పట్టింది అన్నారు.

అఖిల్ అక్కినేని – సాక్షి వైద్య జంటగా మాస్ అండ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్” ఎప్పుడు ఎప్పడా అని వూరిస్తూ ఈ రోజు విడుదలైంది.

agent poster

మరి ఈ సినిమా ప్రేక్షకులు మీడియా మిత్రులతో మా 18f ఫిల్మ్ జర్నలిస్ట్ కృష్ణ ప్రగడ కూడా చూద్దాం జరిగినది. ఈ ఏజెంట్ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

కధ ను పరిశీలిస్తే (story line):

రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్ అక్కినేని) ఎథికల్ యాకర్ గా ఉంటూ  ‘రా’ ఏజెంట్ అవ్వాలనే కోరిక తో ఇంట్లో చెప్పకుండా మూడుసార్లు ఎగ్జామ్ రాస్తాడు. ఆ మూడుసార్లూ తన ఓవర్ యాక్షన్ తో  ఇంటర్వ్యూలో రిజక్ట్ అవుతాడు. లాభం లేదనుకుని ‘రా’ చీఫ్ డెవిల్ అలియాస్ మహాదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్ హ్యాక్ చేస్తే తన దృష్టిలో పడతాను అని చేస్తాడు.

ఈ మధ్యలో రిక్కీ, వైద్య (సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. కానీ అంతలో డెవిల్ మహాదేవ్, రిక్కీకి ఒక డేంజరస్ మిషన్ అప్పగిస్తాడు.

ఇంతకీ డెవిల్ ఇచ్చిన ఏమిటి ఆ మిషన్ ఏమిటి ?,

అసలు రిక్కీ ఎందుకు రా ఏజెంట్ కావాలనుకకుంటాడు?,

చివరకు రిక్కీ, డెవిల్ మహాదేవ్ ఇచ్చిన మిషన్ ను పూర్తి చేశాడా?

మద్యలో ఏజెంట్ గాడ్ ఎవరు ? డెవిల్ మంచివడా కదా ?

ఏజెంట్ గాడ్ కి డెవిల్ కి మద్య గొడవ ఏమిటి ?

రిక్కీ మహదేవ్ ఇచ్చిన  మిషన్ కంప్లీట్ చేశాడా ?

లేదా? అనేది మిగిలిన కథ.

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

agent posters 8 2

అన్నీ స్పై కినేమాలలోనూ ఓకే రకమైన కధ ఉన్నా, స్క్రీన్ ప్లే ట్విస్టులతో కధనం రాసుకొని ప్రతిసారీ ప్రేక్షకులకు కొత్త అనఉబుతి ఇస్తారు. కొన్ని స్పై ఏజెంట్ సినిమాలు మరలా చూసేలా ఉంటాయి.

మనం ప్రస్తుతం అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కధనం (స్క్రీన్ -ప్లే) గురించి చూస్తే కధనం లొని  మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనది కాకపోయినా.. కనీసం ఇంట్రస్ట్ గా అయిన సాగాలి. ఈ కథలో అసలు పాయింట్ అనేదే లేదు. దర్శకుడిగా సురేందర్ రెడ్డి గతం లో కిక్ , రేస్ గుర్రం , దృవ వంటి సక్తికరమైన కథనంతో సినిమాలను  ఇంట్రెస్టింగ్ గా మలచి ప్రేక్షకులతో స్టీల్ అండ్ మాస్ యాక్షన్ సినిమాల మాస్టారు అనిపించుకున్నారు.

కానీ ఈ ఏజెంట్ సినిమా కి వచ్చేటప్పటికి చాలా లాజిక్ లేని , సోల్ లేని , కృత్రిమ సీన్స్ రాసుకొని మామా అనిపించినట్టు ఉంది. ఎక్కువ బడ్జెట్ తో కాస్ట్లీ మూవీ చేద్దాము అనుకొన్నప్పుడు కధ , కధనం మీద కూడా దృష్టి పెట్టాలి కదా ! పైగా ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలే గుర్తుకువస్తాయి కానీ స్పై థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ లా లేదు.

agent wild saala

అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషనల్ సీన్  కూడా బలంగా ఎలివేట్ కాలేదు. నిజానికి క్లైమాక్స్ లో మమ్ముట్టి క్యారెక్టర్ ను ఎమోషనల్ గా డిజైన్ చేసినప్పటికీ.. అది పెద్దగా స్క్రీన్ మీద వర్కౌట్ కాలేదు. సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ అండ్ ఇన్విస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగినా.. ఎక్కడా వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ కూడా బలంగా లేకపోవడం ఈ సినిమాకి మరో బలహీనత.

ఏజెంట్ సినిమా మెయిన్ గా బి సి సెంటర్ మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ.. దర్శకుడు మాత్రం అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్ ను తప్ప.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ను సినిమాలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.

పైగా ఈ చిత్రంలో చాలా తేలికపాటి ఇన్విస్టిగేషన్ తో రా ఆఫీసు ని అపహాస్యం చేసే ల సీన్స్ రాసుకొన్నారు. కనీసం కొంత రిసెర్చ్ అయిన చేసి ఉండవలసింది. రా ఆఫీసు లో ఇంపార్టంట్ మీటింగ్ ని ఏదో దేశం లో ఉన్న విలన్ సి సి కెమెరా ఫూటేజ్ చూసినట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా ఏ ఏజెంట్ సినిమా కధనం మొన్ననే వచ్చిన పఠాన్ సినిమా లనే ఉంటుంది. కొన్ని ఎలిమెంట్స్ రెండు కినేమాలలోనూ ఒకేలా ఉంటాయి. కానీ పఠాన్ సినిమా హాలీవుడ్ మూవీ లాంటి  థియేటర్ ఎక్స్పెరియన్స్ ఇస్తే ఈ ఏజెంట్ సినిమా ఇండియన్  వెబ్ సిరీస్ లా సాగింది.

agent event 1 6

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గానీ, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వానికి నేను చాలా పెద్ద అభిమానిని, తన ఫ్లాప్ సినిమాలు కూడా చాలా స్టయిల్ గా ఇంటరెస్ట్ గా ఉంటాయి. హిట్ సినిమాలు అతనొక్కడే, కిక్ , రేస్ గుర్రం ,దృవ వంటివి మరలా మరలా చూసేలా ఉంటాయి. కానీ ఈ ఏజెంట్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది.  ఇది మాత్రం మరో లెవెల్ టార్చర్ లాంటి సినిమా.

అక్కినేని అఖిల్, వైల్డ్ సాలె రిక్కీగా ఈ సినిమాలో  పవర్ ఫుల్ పాత్ర‌లో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అఖిల్ అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే తన క్యారెక్టరైజేషన్ అండ్ మాడ్యులేషన్ తో తన పాత్రకు ఫర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో అఖిల్ కొత్త లుక్స్ తో చాలా వైల్డ్ గా కనిపించాడు. ఇటు హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాల్లో, అటు యాక్షన్ సన్నివేశాల్లో అఖిల్ చాలా సెటిల్డ్ గా చక్కగా నటించాడు.

హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్య కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ మమ్ముట్టి. ఆయన ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో మమ్ముట్టి నటన చాలా బాగుంది.

డినో మోరియా ఏజెంట్ గాడ్ అనే పాత్రలో విలన్ గా  బాగానే నటించాడు. కొన్ని సీన్స్ లో రొటీన్ గా ఉన్న తన హవ భావాలతో ఆకుట్టుకొన్నాడు.

agent event 1 7

అఖిల్ కి తండ్రి పాత్రలో కనిపించిన మురళీ శర్మ , రా ఆఫీసు లో మహదేవ్ కి సహాయ ఆఫీసర్ గా నటించిన వర లక్ష్మీ శరత్ కుమార్, మినిస్టర్ గా నటించిన సంపత్ పాడింగ్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోయారు .

అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు సురేందర్ రెడ్డి హై టెక్నికల్ వేల్యూస్‌ తో బాగా రిచ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు కానీ వీక్ స్క్రీన్ ప్లే వలన రిజిస్టర్ కాకుండా పోతాయి.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

 మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే…హిప్ హాప్ తమిజా అందించిన సంగీతం అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది కానీ బోరింగ్ సాంగ్ ట్యూన్స్ తో సినిమాకి సాంగ్స్ మైనస్ గా మారాయి. ఇంకా బిజియం వర్క్ కూడా ఇనకాంప్లెట్ గా ఉంది.

రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫర్ పనితనం బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా రసూల్ దృశ్యాలని బాగా తెరకెక్కించారు.

నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంత డబ్బు ఈ కధ మీద పెట్టడం అనిల్ సుంకర చేసిన తప్పు. అఖిల్ కోసం సినిమా చేశారా అనిపిస్తుంది.

agent event 1 8

18F మూవీస్ టీం ఒపీనియన్:

అఖిల్ లవర్ బాయ్ ఇమేజ్ ని వదిలి వైల్డ్ సాలె  ఏజెంట్ అంటూ వచ్చిన ఈ సినిమాలో ఒక్కటి అంటే ఒక్కటి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ లేదు. అఖిల్ వైల్డ్ గా ఉన్న  పెర్ఫార్మెన్స్ చేయడానికి మంచి సీనో కధో ఉండాలి కదా !. ఏజెంట్ లో మమ్ముట్టి నటన మాత్రమే మెప్పిస్తుంది. బోరింగ్ కధనం తో పాటు లాజిక్ లెస్ సీన్స్, ఇంట్రెస్ట్ కలిగించలేని యాక్షన్ డ్రామా సినిమాకి చాలా  మైనస్ అయ్యాయి.

ఓవరాల్ గా ఏజెంట్  సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అక్కినేని అభిమానులకు కూడా  నచ్చవు. కిక్, రేస్ గుర్రం, దృవ వంటి సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి నేనా ఈ ఏజెంట్ సినిమా డైరెక్టర్ అనిపిస్తుంది. సూరి గారి ఫ్లాప్ సినిమాలు కూడా చాలా స్టయిల్ గా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్, సీన్ న్యాచురల్ గా కన్వయినెన్స్ గా ఉంటుంది. మరీ ఏజెంట్ సినిమా ఎందుకు ఇలా చేశాడో ఆయన కె తెలియాలి. సామాన్య వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు.

టాగ్ లైన్: లక్ష్యం (కధ) లేని ఏజెంట్ కి ఖరీదైన రైడ్ !

18F Movies రేటింగ్: 2 / 5 

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *