Adah Sharma Criminal or Devil? CD Trailer Review: ‘C.D’ ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ !

IMG 20240427 WA0098 e1714202884215

అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తున్నారు.

హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో అదా శర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదా శర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు అదా శర్మ ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమాతో రాబోతున్నారు. ది కేర‌ళ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం.

IMG 20240427 WA0099

C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 10న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

‘చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు.. ఎవరు చేస్తున్నారు ఇదంతా?.. నా చుట్టూ ఏదో జరుగుతోంది.. నాతో పాటు ఇంట్లో ఉంటోంది దెయ్యమా?.. మరణంతో పాటు యుద్దం తప్పదా?.. నన్ను చంపడానికి వచ్చింది ఎవరు క్రిమినల్? ఆర్ డెవిల్?’ అంటూ హీరో విశ్వంత్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ సాగుతుంది.

ఇక ఈ ట్రైలర్‌లో అదా శర్మ యాక్షన్ సీక్వెన్స్, భయపెట్టేలా చూసే చూపులతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయనిపిస్తోంది.

ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.

సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

నటీనటులు:

అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ..

 

టెక్నీషియన్స్: 

బ్యానర్ : SSCM ప్రొడక్షన్స్, డైరెక్టర్ : కృష్ణ అన్నం, స్టోరీ డైలాగ్స్ : ఏ ముద్దు కృష్ణ, DOP : సతీష్ ముత్యాల, మ్యూజిక్ : RR ధృవన్, ఎడిటర్ : సత్య గిడుతూర్ , యాక్షన్స్ : రామ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్, PRO : సాయి సతీష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *