సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ !

IMG 20250716 WA0131

 మనం చేసిన మంచి పనిని గుర్తించటమే కాకుండా ఆ పనికి అవార్డులు రివార్డులు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది…ప్రస్తుతం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఫేమస్‌ తమిళ, కన్నడ, తెలుగు నటి సంచితా శెట్టి.

సంచితా విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘సూదుకవ్వుమ్‌’, ఆశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించిన ‘విల్లా’తో పాటు ప్రభుదేవా హీరోగా ‘భగీరా’ చిత్రాలతో పాటు దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.

IMG 20250716 WA0128

సంచితా శెట్టి నటనతో పాటు యూత్‌ లీడర్‌ షిప్‌ సేవలను దృష్టిలో ఉంచుకుని సెయింట్‌ మథర్‌ థెరిసా యూనివర్సిటీవారు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు.

IMG 20250716 WA0134

కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఇకపై మరిన్ని మంచి పనులు చేయటానికి ఈ డాక్టరేట్‌ కొత్త ఊపిరిని అందించిందని సంచితా శెట్టి పేర్కొన్నారు.

ఈ అవార్డుకు తనను ఎన్నుకున్న కమిటీకి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *