‘ఓ భామ అయ్యో రామ’ చిత్ర హీరోయిన్  మాళవిక మనోజ్‌ స్పెషల్ ఇంటర్వూ!

IMG 20250707 WA0204 e1751887108160

కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది.

రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్‌ సోమవారం మా 18F మూవీస్ మీడియా ప్రతినిథితో చిత్ర విశేషాలను పంచుకొన్నారు. వాటిలోని ముఖ్య విషయాలు మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము.

 ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? 

నేను తమిళంలో నటించిన చిత్రం ‘జో’లో నా అభినయం చూసి దర్శకుడు రామ్‌ ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసుకున్నాడు. కథ వినగానే నాకు ఎంతో నచ్చింది.

స్టోరీలో మీకు నచ్చిన అంశాలేమిటి? 

అది సింగిల్‌లైన్‌లో చెప్పలేను. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. గతంలో నేను చేసిన సినిమాల్లో విలేజ్‌ సింపుల్‌ గర్ల్‌గా చేశాను. ఈసినిమలో నా పాత్ర ఎంతో మోడ్రరన్‌గా, హైపర్‌గా, అటిట్యూడ్‌తో ఉంటుంది. ప్రతి నటికి కావాలసిన వైవిధ్యమైన పాత్ర లభించింది. ఈ చిత్రంలో సత్యభామ అనే పాత్రలో కనిపించాను

ఈ పాత్ర కోసం ఏమైనా హోమ్‌ వర్క్‌ చేశారా:? 

ఈ సినిమా కోసం ఎలాంటి వర్క్‌ పాప్‌, హోంవర్క్‌ చేయలేదు. నా రియల్‌లైఫ్‌కు ఎలాంటి కంపారిజిన్‌ లేని పాత్ర సత్యభామ పాత్ర. నాకు తెలుగు రాకపోయినా.. దాని భావం అర్థం చేసుకుని నటించాను.

తెలుగులో నటించడం ఎలా అనిపించింది?

చాలా హ్యపీగా అనిపించింది. తెలుగు టెక్నిషియన్స్‌, ఆర్టిస్ట్‌ల్లో ఎంతో ప్రొఫెజనలిజం వుంది. ఎంతో కంపర్టబుల్‌గా నటించాను. లాంగ్వేజ్‌ తప్ప నాకు తెలుగులో ఎలాంటి ప్రాబ్లమ్‌ అనిపించలేదు. అన్ని లాంగ్వేజ్‌ల మాదిరిగా నాకు ఇక్కడ ఎక్కడ కంఫర్టబుల్‌గా అనిపించింది.

IMG 20250707 WA0206

ఈ చిత్రంలో ఛాలెంజింగ్‌ అనిపించిన సన్నివేశం ఏమైనా?

ఈ సినిమాలో కోసం నాకు స్విమింగ్‌ రాకపోయినా.. ఓ సన్నివేశంలో షూటింగ్‌ వాయిదా పడటం ఇష్టం లేక నేను భయపడుతూనే స్విమింగ్‌ చేశాను. నాకు ఎంతో భయమేసిన సినిమా కోసం చేశాను.

తెలుగు నేర్చుకున్నారా?

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. తెలుగు అర్థం అవుతుంది.. తమిళం నుంచి తెలుగులోకి డబ్‌ అయినా సినిమాలు చూస్తుంటాను. ఇటీవల తెలుగు హిట్‌-3 సినిమా చూశాను.

చాలెంజింగ్‌ రోల్స్‌ ఏమైనా చేయాలని ఉందా?

నాకు ఎప్పుడూ, డిఫరెంట్‌గా చాలెంజింగ్‌ పాత్రలు చేయాలని ఉంటుంది. ప్రతి సినిమాలో రొటిన్‌ పాత్రలు చేస్తే నాకే కాదు ఆడియన్స్‌కు కూడా బోర్‌ కొడుతుంది. నన్ను నేను ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రల్లో చూసుకోవడమే నాకు ఇష్టం.

హరీశ్‌ శంకర్‌, మారుతిలతో నటించం ఎలా ఉంది ?

వెరీ నైస్‌ వర్కింగ్‌ విత్‌ గ్రేట్‌ పర్సన్‌.. 

సుహాస్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ? 

వెరీ నైస్‌ పర్సన్‌. ఎంతో హార్డ్‌వర్క్‌ చేస్తాడు. సినిమా సెట్‌లో సినిమా కోసం మాత్రమే మాట్లాడతాడు. పెద్ద టాకింగ్‌ పర్సన్‌ కాదు.

IMG 20250707 WA0203

 ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో లవ్‌సీన్స్‌ కొత్తగా అనిపిస్తున్నాయి:? 

 జనరల్‌గా అని సినిమాల్లో ఉండే ప్రేమ సన్నివేశాలే అయినా ఈ సినిమాలో లవ్‌సన్నివేశాల్లో ఫీల్‌ కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఎంటర్‌టైన్‌ అవుతారు.

 ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో నటించడం ఎలా ఉంది? 

ఈ సినిమా చేయడం, ఇలాంటి పాత్ర లభించడం, సత్యభామ పాత్ర చేయడం నేను ఎంతో లక్కీగా భావిస్తున్నాను.

మీ ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి? 

సినిమా నేపథ్యంతో సంబంధం లేని ఫ్యామిలీ నాది. ఫ్యామిలీ సపోర్ట్‌తోనే నటిస్తున్నాను. కానీ అందరూ బంధువులు మొదట్లో భయపడ్డారు. నాకు మాత్రం ఎలాంటి భయం లేదు. సినిమాల్లో నటించడం గర్వంగా ఉంది. ఇప్పుడు ట్రైలర్‌ చూసి మా ఫ్యామిలీ ఎంతో హ్యపీగా ఫీలయ్యారు.

సుహాస్‌ గత సినిమాలు ఏమైనా చూశారా? 

కలర్‌ఫోటో, హిట్‌-2 చూశాను. 

సినిమాల ఎంపిక విషయంలో మీరు పరిగణనలోకి తీసుకునే అంశాలు ఏమిటి? 

నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. నాకు నచ్చిన కథలతో మాత్రమే చేస్తున్నాను. నా కంఫర్ట్‌ జోన్‌లో సినిమాలు చేస్తున్నాను. నేను ఆ రోల్‌ ఫిట్‌ అనుకుంటేనే చేస్తున్నాను. మలయాళ ఫిల్మ్‌ ఫస్ట్‌ చేశాను. జో తమిళ చిత్రం.

ఈ సినిమా పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది? మీకు నచ్చిన పాట ఏది?

అన్ని పాటలు నాకు బాగా నచ్చాయి. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఈ పాటలు అందరికి నచ్చాయి. అన్ని పాటలు నా మనసుకు హత్తుకున్నాయి.

 నిర్మాత హరీష్‌ గురించి చెప్పండి ?

నిర్మాత ఎంతో నైస్‌ పర్సన్‌. సినిమాకు ఎంత కావాలో చాలా రిచ్‌గా ఖర్చు పెట్టాడు. సినిమా అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

గ్లామరస్‌ రోల్స్‌ చేస్తారా? 

గ్లామరస్‌ రోల్స్‌.. చేయాలా వద్దా? అనే నిబంధన నాకు లేదు. కథ నచ్చితే నాకు కంఫర్టబుల్‌గా అనిపించిన రోల్స్‌ మాత్రమే చేశాను. నాకు నచ్చని పాత్రలు నేను చేయను.

ఒకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ మాల్విక గారు,

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *