Actor  Thiruveer next Movie poster Unveiled: తిరువీర్ హీరో గా RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 పోస్టర్ రిలీజ్ !

IMG 20240417 WA0156 e1713357545530

డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ నాలుగో ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది. RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్ బ్యానర్ల మీద రాధాకృష్ణ తేలు, రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ వన్‌ను శ్రీరామ నవమి సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తిరువీర్‌కు జోడిగా మలయాళీ భామ కార్తీక మురళీధరన్ నటిస్తున్నారు.

IMG 20240417 WA0252

బిల్లా, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన రామకృష్ణ రెడ్డి (ఆర్కే) ఈ మూవీతో నిర్మాతగా పరిచయం కానున్నారు. అర్దశతాబ్దం, లూట్ వంటి ప్రాజెక్టు‌లు నిర్మించిన రాధాకృష్ణ తేలు, ఆర్కేతో కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. శ్రీకాంత అడ్డాల వద్ద అసిస్టెంట్‌గా కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రమ్మోత్సవం వంటి సినిమాలకు దర్శకుడు ఘంటా సతీష్ బాబు పని చేశారు. బట్టర్ ఫ్లై సినిమాతో దర్శకుడిగా మారి ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దం అవుతున్నారు.

IMG 20240417 WA0251

ఈ మూవీ మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. త్రేతాయుగానికి, కలియుగానికి మధ్య ఈ కథ జరుగుతుంది. ఎంతో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో అయ్యప్ప పి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, మీసాల లక్ష్మణ్, పంకజ్ కేసరి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి రామి రెడ్డి కెమెరామెన్‌గా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌ గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు :

తిరువీర్, కార్తీక మురళీధరన్, అయ్యప్ప పి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, మీసాల లక్ష్మణ్, పంకజ్ కేసరి తదితరులు

సాంకేతికబృందం:

బ్యానర్ : RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్,నిర్మాత : రాధాకృష్ణ తేలు, రామకృష్ణ రెడ్డి,దర్శకుడు : ఘంటా సతీష్ బాబు,కెమెరామెన్ : రామి రెడ్డి,ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్, పీఆర్వో : వంశీ కాకా..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *