Actor ShriTej Special Interview with 18FMS: 2023 నా కెరీర్‌లో మర్చిపోలేనిది అంటున్న నటుడు శ్రీతేజ్‌ స్పెషల్ ఇంటర్వూ!

IMG 20231230 WA0156 e1703943536910

 

2023 కూడా తన నట జీవితంలో మర్చిపోలేనిదిగా అభివర్ణించారు… వంగవీటి, కథానాయకుడు, మహానాయకుడు, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌,అక్షర, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ధమాకా, పరంపర, 9 అవర్స్‌, ‘మంగళవారం’ తదితర చిత్రాలతో , విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీతేజ్. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తున్నారు. అందులో పుష్ప`2 కూడా ఉండటం విశేషం.

IMG 20231230 WA0155 1

తాజాగా తన కెరీర్‌ గురించి మా 18F మీడియా ప్రతినిధి తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల విడుదలైన ‘మంగళవారం’ సినిమా ఘన విజయం సాధించి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో గురజ రోల్‌కు నన్ను ఎంచుకున్నందుకు దర్శకులు అజయ్‌ భూపతి గారికి థ్యాంక్స్‌. అలాగే నిర్మాత సురేష్‌గారు, స్వాతి గార్లకు కూడా ధన్యవాదాలు.

ఈ రోల్‌ గురజ గురించి చెప్పినప్పుడు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ అనుకున్నాము. ఈ పాత్ర గురించి వినగానే నేను చాలా థ్రిల్‌ ఫీలయ్యాను. మరో కొత్తరం పాత్రను చేసే అవకాశం దొరికింది అని హ్యాపీగా ఫీలయ్యాను. ఇపుడు సినిమా సూపర్‌హిట్‌ కావడంతో ఆ సంతోషం డబుల్‌ అయ్యింది. యూనిట్‌ అంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.

IMG 20231230 WA0157

రవితేజ గారి ‘రావణాసుర’లో దేవరాజ్‌ రోల్‌ చేశాను. నాకు మంచి రోల్‌ ఇచ్చినందుకు సుధీర్‌వర్మ, నిర్మాత అభిషేక్‌ గారికి, నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మాస్‌ మహారాజా రవితేజ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను .

ఇదే సంవత్సరం నేను నటించిన ‘దళారి’ సినిమా కూడా రిలీజ్‌ అయ్యింది. నిర్మాత వెంకట్‌ గారికి, దర్శకులు గోపాల్‌ గారికి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. 2023 నాకు చాలా సంతోషాల్ని ఇచ్చింది. ఎంతో సంతోషంగా గడిచింది.

IMG 20231230 WA0154

 

 

2024లో హీరోగా నేను నటిస్తున్న ‘బహిష్కరణ’ వెబ్‌సిరీస్‌ జీ`5లో స్ట్రీమింగ్‌ కాబోతుంది . అలాగే మరో చిత్రం “ర్యాంబో” . , నా రాబోయే చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నారు.

 

Yours @actorshritej

ఓకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ శ్రీ తేజ్..

*కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *