డైలాగ్ కింగ్ సాయి కుమార్ కి కొమరం భీమ్ జాతీయ పురస్కారం

InShot 20250311 135632383 e1741681715372

నటుడిగా స్వర్ణ ఉత్సవం జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్ ‘అగ్ని’ సాయి కుమార్ కి 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారానికీ ఎంపికచేసినట్లు సెలక్షన్ చైర్మన్ సి.పార్ధ సారధి IAS, కో-చైర్మన్ నాగబాల డి.సురేష్ కుమార్, కన్వీనర్ కొమరం సోనే రావు, శిడాం అర్జు మాస్టారు, అధికారిక ప్రకటనలో తెలియచేసారు.

గత 12 సంవత్సరాలుగా ‘భారత కల్చరల్ అకాడమి, ఓం సాయి తేజ ఆర్ట్స్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్’ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డ్ ను అందిస్తున్నామని, గతంలో ఈ కొమరం భీమ్ అవార్డును సుద్దాల అశోక్ తేజ, అల్లాణి శ్రీధర్, లెజెండరీ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్, గూడ అంజయ్య వంటి దిగ్గజాలకు ఈ పురస్కారం తో సన్మానించమని, అవార్డు తో పాటు జ్ఞాపిక ను, యాబై ఒక వెయ్యి రూపాయల నగదు అందిస్తామని, కమిటి సభ్యులు తెలియచేసారు.

మార్చ్ 23 వ తేది నాడు ఈ పురస్కరోత్సవం కొమరం భీమ్ జిల్లా, ఆసిఫాబాద్ కేంద్రం లోని ప్రమీల గార్డెన్స్ లో స్తానిక శాసనసభ్యులు శ్రీమతి కోవా లక్ష్మి, ప్రముఖ బి జే పి నాయకులు శ్రీ అరిగెల నాగేశ్వర రావు గారి పర్యవేక్షణలో జరుపుతున్నామని, రాజకీయ, సినీ, వ్యాపార, గిరిజన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని వారు తెలియ చేసారు.

ఈ సందర్భంగా గిరిజన కళాకారులతో పలు గిరిజన సాంప్రదాయ నృత్యాల ప్రదర్శన ఆకర్షణ కాబోతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *