Actor Murali Mohan felicitated with Golden jubilee film star Award: అంగరంగ వైభవంగా మురళీమోహన్ స్వర్ణోత్సవ వేడుక !

MuraliMohan2 e1710848069343

సీనియర్ నటులు మురళీ మోహన్ చలన చిత్ర పరిశ్రమలో అడుగిడిగి 50 సంవత్సరాలు అయిన సందర్బాన్ని పురస్కరించుకొని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు ఘనంగా సత్కరించాయి. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర ప్రసాద్, సెక్రటరీ ప్రసన్న కుమార్, వ్యాపార వేత్త కోగంటి సత్యం మరియు 20 మంది యువ కధానాయకుల సమక్షంలో పండితుల వేదమంత్రాల మధ్య మురళి మోహన్ ని ఘనంగా సత్కరించారు.

ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మురళి మోహన్ మాట్లాడుతూ... అట్లూరి పూర్ణచంధ్రరావు గారి చేతుల మీదుగా 33 వ ఏట కళామతల్లి ఆశీస్సులు పొందిన తాను నటునిగా, వ్యాపార వేత్తగా విజయవంతంగా రాణించానని, ఈ క్రమంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృజ్ఞతలు తెలుపుకొంటున్నాని అన్నారు. ఇదే వేదికపై ఇటీవల జరిగిన ఎన్నికలలో వీరశంకర్ అధ్యక్షునిగా విజయం సాధించిన తెలుగు దర్శకుల సంఘం కార్యవర్గాన్ని మరియు శుభోదయం సుబ్బారావు నేతృత్వంలో విజయం సాధించిన తెలంగాణ మూవీ టెలివిజన్ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని మురళి మోహన్ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

Murali mohan

నిర్మాతల మండలి అధ్యక్ష కార్యదర్సులు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు వశిష్ఠ, తెలంగాణ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు మురళీ మోహన్ ఔనత్యాన్ని కొనియాడారు. స్వర్ణోత్సవ వేళ ఓ గొప్ప నటుడ్ని సత్కరించుకొనే అవకాశం రావడం పట్ల చైతన్య జంగా, విజయ్ వర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ రావిపల్లి అందించిన ప్రశంసా పత్రం, మిమిక్రి రమేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ సభికులను ఎంతగానో ఆకట్టుకొంది.

జర్నలిస్టులు ధీరజ్ అప్పాజీ , కూనిరెడ్డి శ్రీనివాస్ లను మురళి మోహన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముంబై నుండి విచ్చేసిన నటీమణులు దని బోస్, అనీషా ముఖర్జీ, రోజా భారతి, సౌమ్య జాను, ముంతాజ్ తదితర వర్ధమాన నటీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *