తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ నటుడు బాబీ సింహ సోమవారం ప్రముఖ మ్యాథ్స్ టీచర్ నర్రా రాంబాబుగారిని గౌరవ పూర్వకంగా కృష్ణాజిల్లా మోపిదేవిలో కలిశారు.
సుమారు 29 సంవత్సరాలు తర్వాత గురువినీ కలిసిన ఆనందం లో బాబిసింహా ఎంతో ఎమోషనల్ అయ్యారు. తనకు చిన్నప్పుడు లెక్కలు చెప్పిన గురు యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.
బాబీ సింహా ‘మాట్లాడుతూ అమ్మా,నాన్నల తర్వాత మనం పూజించేది గురువు లనే. నాకు అలాంటి గురువు నార్ర రాంబాబుగారు.
ఆయన మాకు పాఠాలతో పాటు లైఫ్ లో ఎలా నడుచుకోవాలో కూడా నేర్పించారు. ఆయన నేర్పిన డిసిప్లీన్ వల్లే నా జర్నీ ఇంత సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది.
29 సంవత్సరాల తర్వాత ఆయన్ని కలిసి మాట్లాడి తన యోగక్షేమాలు కనుక్కున్నాను. ఆయన్ని కలిసిన తర్వాత వ్యక్తిగతంగా నేను ఎంతో ఎమోషన ల్‌గా ఫీలయ్యానో మీ అందరితో పంచుకోవాలి అనిపించింది’’ అన్నారు.
ప్రతి వ్యక్తి ఎదుగుదల లో తల్లి తండ్రులు తర్వాత గురు డే ప్రథమ స్థానం. మనం కూడా మనకు చదువుతో పాటు క్రమ శిక్షణ నేర్పిన గురువులను తరుచుగా కలుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి.
తప్పక ఆచరించండి. కలిసే ప్రయత్నం చేద్దాము.