తెలుగులో రానున్న మలయాళ త్రిల్లర్ చిత్రం ఐడెంటిటీ . విడుదల ఎప్పుడంటే ! 

IMG 20250117 WA0118 scaled e1737272437492

అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ.

మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చెరువుగా మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది.

IMG 20250118 WA0145

జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులకు ఉత్కంఠభరితంగా ప్రేక్షకులు కల్లప్పగించి చూసే విధంగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఐడెంటిటీ ఈ నెల 24వ తేదిన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం:

టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి తదితరులు.

సాంకేతిక బృందం : 

రచన దర్శకత్వం : అఖిల్ పాల్, అనాస్ ఖాన్,  నిర్మాతలు : రాజు మల్లియాత్, రాయ్ సిజె ,సినిమాటోగ్రఫీ : అఖిల్ జార్జ్ , ఎడిటర్ : చామన్ చక్కో , సంగీతం : జేక్స్ బెజోయ్ , సమర్పణ : మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల, తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ : శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు , పిఆర్ఓ : మధు విఆర్ , డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *