Aarambham Movie Trailer Launch Highlights: “ఆరంభం” సినిమా ట్రైలర్ లాంఛ్ చేసిన మూవీ యూనిట్ ! రిలీజ్ ఎప్పుడంటే !

Aarambham Trailer launch highlights 10 e1714591173569

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “ఆరంభం” సినిమా మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

Aarambham Trailer launch highlights 9

లిరిసిస్ట్ శ్రీకాంత్ మాట్లాడుతూ – ఇలా ఒక మూవీ ప్రమోషన్ స్టేజీ మీద నిలబడి మాట్లాడుతానని ఊహించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన “ఆరంభం” టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో మంచి పాటలు రాసే అవకాశం దక్కింది. “ఆరంభం” సినిమా బాగుంటుందనే పాజిటివ్ వైబ్స్ ఇప్పటికే ఏర్పడుతున్నాయి. మా టీమ్ అందరికీ ఈ సినిమా ఒక మంచి బిగినింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

Aarambham Trailer launch highlights 12

ఎడిటర్ ఆదిత్య తివారీ మాట్లాడుతూ – “ఆరంభం” సినిమాకు నేను ఎడిటర్ ను మాత్రమే కాదు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాను. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా అన్ని వర్క్స్ లో ఇన్వాల్వ్ అయ్యాను. ఈ సినిమా స్క్రిప్ట్ నుంచి ఫిల్మ్ మేకింగ్ వరకు జరిగిన ట్రాన్సఫర్మేషన్ ఒక మ్యాజిక్ అనుకోవాలి. మీరు చూసిన ప్రతి ఫ్రేమ్ ఇంత బాగా రావడానికి ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ 200 పర్సెంట్ కష్టపడ్డారు. “ఆరంభం” మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

Aarambham Trailer launch highlights 8

ఎడిటర్ ప్రీతమ్ గాయత్రి మాట్లాడుతూ – “ఆరంభం” సినిమాకు పనిచేసిన మెయిన్ క్రూ అంతా ఒకే కాలేజ్ నుంచి వచ్చాం. అజయ్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కొంత కాంప్లికేటెడ్ గా అనిపించింది. కానీ మొత్తం షూటింగ్ అయ్యాక చూస్తే బాగా ఆకట్టుకుంది. మే 10 మీరంతా వచ్చి “ఆరంభం” సినిమా చూడండి. అన్నారు.

Aarambham Trailer launch highlights 11

సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి మాట్లాడుతూ – దర్శకుడు అజయ్ నా లైఫ్ లోకి ఒక బ్లెస్సింగ్ లా వచ్చాడు. ఈ సినిమా చూశాక నేను ఈ మూవీకి మ్యూజిక్ చేయడం ఏంటి, నేను చేయగలనా అని భయపడ్డాను. అజయ్ సపోర్ట్ చేశాడు. మూవీ టీమ్ అంతా సపోర్ట్ చేసింది. ఈ సినిమా మ్యూజిక్ చేశానంటే అది డెస్టినీ అనుకుంటా. నా గదిలో అన్నీ ఎస్పీ బాలు ఫొటోసే ఉంటాయి. ఈ సినిమాలోని పాటను ఎస్పీ చరణ్ గారితో పాడించినప్పుడు బాలు గారు గుర్తొచ్చి కన్నీళ్లు వచ్చాయి. పాటలు, ఆర్ఆర్ అన్నీ ఒక ఫ్లోలో చేసుకుంటూ వెళ్లాం. “ఆరంభం” టీమ్ అందరికీ పేరు తెచ్చే సినిమా అవుతుంది. అన్నారు.

Aarambham Trailer launch highlights 6

సినిమాటోగ్రాఫర్ దేవ్ దీప్ గాంధీ మాట్లాడుతూ – “ఆరంభం” సినిమాను కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. మే 10న థియేటర్స్ లోకి వెళ్లి చూడండి. ట్రైలర్ మీరు చూశారు. ఈ కథకు మేము పెట్టాల్సిన ఎఫర్ట్స్ అంతా పెట్టాం. ఇక ఈ సినిమా ఫలితం మీ చేతుల్లో ఉంది. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసేలా “ఆరంభం” మూవీ ఉంటుంది. అన్నారు.

Aarambham Trailer launch highlights 3

నిర్మాత అభిషేక్ వీటీ మాట్లాడుతూ – “ఆరంభం” సినిమా చేసేందుకు ముఖ్య కారణం మా నాన్న. ఆయన డబ్బులు ఇచ్చి నా డ్రీమ్ అయిన సినిమా ప్రొడక్షన్ లోకి పంపించారు. అందుకు మా అమ్మా నాన్నకు థ్యాంక్స్ చెబుతున్నా. ఉజ్వల్ ఈ సినిమా కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన ద్వారా అజయ్ పరిచయం అయ్యారు. “ఆరంభం” సినిమా వెనక ఉన్న విజినరీ డైరెక్టర్ అజయ్. ఈ సినిమా ట్రైలర్ లో చెప్పినట్లు మనం చేసే ప్రయాణంలో మనతో ఉండే తోడు ఎవరేది చాలా ముఖ్యం. అలా నాకు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రయాణంలో టీమ్ మెంబర్స్ అంతా తోడుగా దొరికారు. ‘

“ఆరంభం” ట్రైలర్ చూశారు కదా. సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. మా మూవీ టీజర్ ను హీరో నాగ చైతన్య గారు రిలీజ్ చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఇది పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమా అని తెలుసు. కానీ కథ విన్నప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమాతో ఒక ప్రయత్నం చేయాలి అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ దక్కుతున్న రోజులు ఇవి. అలా “ఆరంభం” సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

Aarambham Trailer launch highlights 5

నటి సురభి ప్రభావతి మాట్లాడుతూ – ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు అజయ్ గారికి, ప్రొడ్యూసర్ అభిషేక్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా టీమ్ లో జాయిన్ అయినప్పుడు అంతా కొత్త వాళ్లు ఎలా ఉంటుందో షూటింగ్ అనుకున్నా. కానీ ఫిలిం మేకింగ్ లో వాళ్ల పట్టుదల, ప్యాషన్ చూసి నేను హ్యాపీగా ఫీలయ్యా. మంచి సినిమా ఇది. ఈ సినిమాకు మీ ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

Aarambham Trailer launch highlights 4

నటుడు అభిషేక్ బోడెపల్లి మాట్లాడుతూ – ఆరంభం సినిమాకు పనిచేసిన వాళ్లలో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నా రూమ్ మేట్స్ ఉన్నారు. ఈ టీమ్ లో ఎవరూ ఏ ఒక్క పనికీ పరిమితం కాలేదు. అందరం అన్ని విభాగాల్లో పనిచేశాం. టీమ్ వర్క్ చేశాం. “ఆరంభం”లో నాకు రవీంద్ర విజయ్ గారితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎంతో హ్యాపీగా అనిపించింది. మీరంతా ఈ సినిమాను థియేటర్ లో చూడండి. సక్సెస్ చేయండి. అన్నారు.

Aarambham Trailer launch highlights 7

భూషణ్ కళ్యాణ్ మాట్లాడుతూ – “ఆరంభం” సినిమా కోసం నన్ను ప్రొడ్యూసర్ అభిషేక్ అప్రోచ్ అయ్యాడు. సైంటిస్ట్ క్యారెక్ట్రర్ చేయాలని చెప్పాడు. నేను వెంటనే నో అని చెప్పా. ఒకసారి డైరెక్టర్ అజయ్ మిమ్మల్ని కలుస్తాడు అని అభిషేక్ చెప్పాడు. ఇక్కడే ఫిలింనగర్ లో ఓ కేఫ్ లో నెరేషన్ విన్నాను. అజయ్ చేసుకున్న స్క్రిప్ట్ బాగా నచ్చింది.

ఈ మూవీ టీమ్ లో పనిచేసిన వారి యావరేజ్ ఏజ్ 24. వీళ్లతో కలిసి పనిచేశాక ఇదొక అద్భుతమైన టీమ్ అనిపించింది. ఏమాత్రం అనుభవం లేని వీళ్లు పశ్చమి కనుమల్లోని లొకేషన్స్ లో ఎవరికీ ఇబ్బంది కలగకుండా షూటింగ్ చేయడం గొప్ప విషయం. నా వయసు వీళ్లతో పోల్చి చూస్తే మూడు రెట్లు ఎక్కువ. ఈ టీమ్ తో వర్క్ చేసి నేను కూడా 24 ఏళ్ల వాడిలా మారిపోయా. రొటీన్ క్యారెక్టర్స్ నాకు చాలా వస్తుంటాయి. వాటిని వద్దనుకుంటున్నా. ఈ మూవీలో మాత్రం నటుడిగా సంతృప్తి దొరికింది. అన్నారు.

Aarambham Trailer launch highlights 2

నటుడు రవీంద్ర విజయ్ మాట్లాడుతూ – నవలను బేస్ చేసుకుని రూపొందించిన సినిమా ఇది. స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టిన సినిమాలు తప్పకుండా బాగుంటాయి. “ఆరంభం” సినిమాకు మా డైరెక్టర్ అజయ్ కథా కథనాల మీద అలాంటి గుడ్ వర్క్ చేశాడు. ఈ మూవీలో నేను డిటెక్టివ్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. ఈ మూవీలోని ప్రతి క్రాఫ్ట్ పనితనం ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేక్షకులకు కంప్లీట్ థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే సినిమా ఇది. డ్రామా, సస్పెన్స్, హ్యూమన్ ఎమోషన్, సైన్స్ ఫిక్షన్ వంటి అంశాలు మెప్పిస్తాయి.

మే 10న థియేటర్స్ కు వెళ్లి “ఆరంభం” మూవీని ఎంజాయ్ చేయండి. మనం లాక్ డౌన్ టైమ్ లో చిన్న సినిమాలన్నీ ఓటీటీకి వస్తాయి. పెద్ద సినిమాలు థియేటర్స్ లో చూడాలి అనుకున్నాం. కానీ ఈ ఏడాది మీరు గమనిస్తే చాలా చిన్న సినిమాలు కంటెంట్ బాగున్నవి థియేటర్ లో మంచి వసూళ్లు సాధించాయి. ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరుతుంది. అన్నారు.

Aarambham Trailer launch highlights 1

దర్శకుడు అజయ్ నాగ్ మాట్లాడుతూ – కన్నడ నవల ఆధారంగా ఈ మూవీకి స్క్రిప్ట్ చేశాను. ఆ నవల రాసింది నా మిత్రుడే. లాక్ డౌన్ టైమ్ లో మా సొంతూరు వెళ్లి కథ సిద్దం చేసుకున్నా. ప్రొడ్యూసర్ గురించి చూస్తున్న టైమ్ లో నా కామన్ ఫ్రెండ్ ద్వారా అభిషేక్ పరిచయం అయ్యారు. అలా ఈ మూవీ బిగిన్ అయ్యింది. మేమంతా కొత్త వాళ్లం. షూటింగ్ ఎలా చేయాలో తెలుసు గానీ ఆర్టిస్టులను కంఫర్ట్ గా ఉంచడం ఎలాగో తెలియదు. వెస్ట్రన్ ఘాట్స్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా కొత్త టీమ్ తో ఇబ్బందులు ఉన్నా ఆర్టిస్టులు అంతా సపోర్ట్ చేశారు.

ఆరంభం సినిమా కథను లైన్ గా చెప్పాలంటే ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకుంటారు. వారి కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఇద్దరు డిటెక్టివ్ లు రంగంలోకి దిగుతారు. వారికి ఒక డైరీ దొరుకుతుంది. ఖైదీల గురించి ఆ డైరీలో ఏముంది. వాళ్లు దొరికారా లేదా అనే ఇంట్రెస్టింగ్ గా సాగే స్టోరీ. మెయిన్ గా సినిమాలో డ్రామా ఉంటుంది. ఒక జానర్ లో కాకుండా వివిధ జానర్స్ లో ఉండే మూవీ ఇది.

కన్నడలో ఈ నవల పాపులర్ అందుకే కన్నడలో కాకుండా తెలుగులో ఈ సినిమా చేశాం. తెలుగులో రిలీజ్ తర్వాత ఇతర భాషల్లోకి సినిమాను తీసుకెళ్తాం. అన్నారు.

Aarambham Trailer launch highlights

హీరో మోహన్ భగత్ మాట్లాడుతూ – కథను నమ్మి నేను ఈ మూవీ చేశాను. ఈ సినిమాలో నా క్రెడిట్ ఏం లేదు. మా డైరెక్టర్ సజెస్ట్ చేసినట్లు నటించాను. నా క్యారెక్టర్ లో అన్ని షేడ్స్ ఉంటాయి. ఈ మూవీలో నేను చేసింది ఇంటెన్స్ క్యారెక్టర్ కాదు. సరదాగా సాగుతుంది. హ్యూమన్ ఎమోషన్స్, డ్రామా, సైన్స్ ఫిక్షన్ లాంటి అంశాలతో ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. ఇందులో మదర్ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది.

అమ్మ మనతో ఉన్నప్పుడు ఆమెతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయము. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత బాధపడతాం. అలా నాది, మా మదర్ క్యారెక్టర్ ఉంటుంది. సినిమా చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. మీ అందరికీ ఆరంభం మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి టీమ్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆరంభం సినిమా నా కెరీర్ కు మంచి ఆరంభం అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

నటీనటులు :

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్: 

ఎడిటర్ – ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి,సినిమాటోగ్రఫీ – దేవ్ దీప్ గాంధీ కుందు,మ్యూజిక్ – సింజిత్ యెర్రమిల్లి,డైలాగ్స్ – సందీప్ అంగిడి,సౌండ్ – మాణిక ప్రభు,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వినయ్ రెడ్డి మామిడి,సీఈవో – ఉజ్వల్ బీఎం,పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్),బ్యానర్ – ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్,ప్రొడ్యూసర్ – అభిషేక్ వీటీ,దర్శకత్వం – అజయ్ నాగ్ వీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *