చాలా రోజులు తర్వాత అల్లరి నరేశ్ హీరో గా అల్లరి చిల్లరిగా నటిస్తున్న లేటెస్ట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా కథనాయికగా నటిస్తుంది. వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ తెలుగు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని హైదరాబాద్ లోని AAA – సత్యం దియేటర్స్ లో జరిపిన ఈవెంట్ లో భాగంగా నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ లో ఆద్యంతం ఆకట్టుకునే మంచి ఫన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు బాగున్నాయి. ముఖ్యంగా నరేష్ యాక్టింగ్, కామెడీ డైలాగ్స్, ఫరియా అబ్దుల్లా అందం, అభినయం, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ అందరినీ ఆకట్టుంటూ మూవీ పై అంచనాలు మరింతగా పెంచుతుంది. ఈ మూవీని వేసవి కానుకగా మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
మరి చాలా గ్యాప్ తరువాత అల్లరి నరేష్ నుండి వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎంతమేర ఆడియన్స్ ని అలరిస్తుందో మే 3 న తెలిసిపోతుంది. అప్పటివరకూ ఈ ట్రైలర్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఈ ఆ ఒక్కటీ అడక్కు సినిమా నుండి మరంత ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయడానికి మేకర్స్ రదీ గా ఉన్నారు.
ఈ ఆ ఒక్కటీ అడక్కు సినిమా ని తెలుగు స్టేట్స్ లో సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ ఫిల్మ్స్ వారు డిస్టబుసన్ రైట్స్ తీసుకొన్నట్టు తెలుస్తుంది.