చిత్రం: ఆ ఒక్కటి అడక్కు,
విడుదల తేదీ : మే 03, 2024,
నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు..,
దర్శకుడు: మల్లి అంకం,
నిర్మాత: రాజీవ్ చిలక,
సంగీత దర్శకుడు: గోపీ సుందర్,
సినిమాటోగ్రఫీ: సూర్య,
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్,
మూవీ: రివ్యూ ( Movie Review)
కొన్ని సీరియస్ సినిమాలు తర్వాత అల్లరి నరేష్ తన హోమ్ గ్రౌండ్ అయిన కామెడీ జానర్ లో ఆడిన (నటించిన) తాజా చిత్ర రాజ్యమే “ఆ ఒక్కటీ అడక్కు”. జాతి రత్నాలు తో ఎంతో ఎత్తుకు ఎదిగిన యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చింది.
అల్లరి నరేష్ తండ్రి అయిన EVV సత్యనారాయణ గారు దర్శకత్వం లో 1992 లో వచ్చి క్లాసిక్ గా నిలిచిన ఆ ఒక్కటి అడక్కు సినిమా టైటిల్, ఈ సినిమా కి పెట్టడం తో తెలుగు సినీ ప్రేక్షకులలో చాలా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా తెలుగ సినీ లవర్స్ ని ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్షలో చదివి తెలుసుకొందమా !

కధ పరిశీలిస్తే (Story Line):
ఓ ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి గణపతి(అల్లరి నరేష్) ఎప్పటి నుంచో తన జీవిత భాగస్వామి కోసం వెతుకుతూనే ఉంటాడు కానీ తన జీవితంలో పెళ్లి అనేది అందని ద్రాక్ష లానే ఉండిపోతుంది. ఈ క్రమంలో స్నేహితుల సలహా మేరకు హ్యాపీ మ్యాట్రిమోనీ అనే సంస్థని సంప్రదిస్తాడు. ఆ మ్యాట్రిమోనీ లో ప్లాటినం మెంబర్ గా జాయిన్ అయిన వారికి పదిమంది ఆమ్మాయిలను కలుసుకొనే అవకాశం ఉంటుంది.
అలా గణ, సిధి(ఫరియా అబ్దుల్లా) అనే ఆమ్మాయిని మొదటి ఆమ్మాయిగా కలిసి మొదటి కళయికలోనే తనే తన జీవిత బాగస్వామి గా ఫిక్స్ అయిపోతాడు. అలా సిధి పట్ల గణ ఫీలింగ్స్ పెంచుకుంటాడు కానీ సిధి వైపు నుంచి గణపతికి ఎలాంటి అనుకూల ఫీలింగ్స్ కనిపించవు. పైగా ఆమె విషయంలో ఓ షాకింగ్ నిజాన్ని కూడా తాను తెలుసుకుంటాడు.
ఇంతకీ సిధి ఎవరు ? ఆమె గతం ఏమిటి ?,
సిధి నుండి గణ తెలుసుకొన్న ఆ నిజం ఏంటి?,
ఇంతకీ గణపతి కి సిధి తో పెళ్లి అవుతుందా లేదా?,
గణపతి కి పెళ్లి లేట్ అవడానికి కారణం ఏమిటి ?,
సిధి కి గణ నచ్చినా పెళ్ళికి ఎందుకు నో చెప్పింది ?,
గణ కి ఎవరితో పెళ్లి అవుతుంది?
అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెంటనే దియేటర్ కి వెళ్ళి చూసి తెలుసుకోవాలి.

కధనం పరిశీలిస్తే (Screen – Play):
ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో అల్లరి నరేష్ నుండి పూర్తి స్థాయి వినోదం ఆశించే ప్రేక్షకులకు కొంతమేర డిజప్పాయింట్ అవ్వొచ్చు. ఇదెలా అంటే సినిమా కధలో మెసేజ్ తో పాటు ఫన్ ట్రీట్మెంట్ ఉన్నా ఎక్కువగా ఎమోషనల్ టోన్ లో కధనం (స్క్రీన్ – ప్లే) మారడం తో సామాజిక సందేశం కామిడీ ని డామినేట్ చేస్తుంది. దీనితో సీరియస్ డోస్ ఎక్కువయి కామిడీ తక్కువ అయ్యింది.
ఆ ఒక్కటి అడక్కు అనే క్లాసిక్ కామిడీ సినిమా టైటిల్ తో కనెక్ట్ అయిన వారు ఈ సినిమా కోసం వ్రాసుకొన్న సీరియస్ కధనం (స్క్రీన్ – ప్లే) కొందరు ప్రేక్షకులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోవచ్చు.
అలాగే రెండవ అంకం (సెకండాఫ్) లో కథనం మొదటి అంకం (ఫస్టాఫ్) తో పోలిస్తే కామెడీ యాంగిల్ మిస్ అయ్యి సీరియస్ గానే నడుస్తుంది. వీటితో సెకండాఫ్ మరీ అంత ఎంగేజింగ్ గా అనిపించదు. అలాగే కల్పలత, జామీ లీవర్ పాత్రలని మరింత బలమైన ఎమోషన్స్ తో ప్రెజెంట్ చేయాల్సింది.
ఇంకా వెన్నెల కిషోర్, వైవా హర్ష లను వారి కామెడీ టైమింగ్ లని ఇంకాస్త ఎక్కువ వాడుకొని ఉంటే బాగుండేది. ఇంకా క్లైమాక్స్ పోర్షన్ కొంచెం వీక్ గా అనిపిస్తుంది.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
డెబ్యూ దర్శకుడు అంకం మల్లి, తాను ప్రస్తుతం సమాజమా లో పెళ్లి అనే తంతులో జరుగుతున్న దోపిడి ని చాలా డీటైల్ గా చెప్పాలని డీసెంట్ సబ్జెక్టుని పట్టుకున్నారు. ప్రతి మనిషి జీవితం లో ఎంతో భావ హృద్రోగంతో ముడిపడిన పెళ్లి అనే ఎమోషనల్ సబ్జెక్టుని కామెడీతో బాగా వ్రాసుకొన్నా స్క్రీన్ మీద చెప్పే ప్రయత్నంలో సరిగ్గా బ్యాలన్స్ అవ్వనట్టు అనిపిస్తుంది.
కధ- కధనం, రెండు బ్యాలన్స్ గా ఉన్నట్టు అయితే ఫన్ అండ్ ఎమోషన్స్ రెండూ సమపాళ్ళ లో ప్రేక్షకులను సంతృప్తి పరిచేవి కానీ కామెడీ నరేషన్, స్క్రీన్ ప్లే తో నడిచే కథనం చివరాకరకు సీరియస్ టోన్ లోకి మారడంతో బ్యాలన్స్ తప్పింది. పాటలు కూడా సినిమా కి మైనస్ అని చెప్పాలి.

సాంగ్స్ తగ్గించి, ఇంకా ఫన్ సీన్స్ యాడ్ చేసి లైటర్ వే లో ఎమోషనల్ పాయింట్స్ డీల్ చేసి ఉంటే సినిమా అవుట్ పుట్ మరింత బెటర్ గా ఉండి ఉండొచ్చు. ప్రస్తుత ప్రేక్షకులు కోరుకొనే కొత్తదనం లేక పోవడం కూడా మైనస్ అని చెప్పవచ్చు.
ఆ ఒక్కటి అడక్కు అనే క్లాసిక్ టైటిల్ కి అన్యాయం జరిగినట్టే!
అల్లరి నరేష్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న కామెడి సీన్స్ కానీ తన టైమింగ్ కానీ మళ్ళీ ఈ సినిమా ద్వారా చూడవచ్చు. తన నుంచి ప్రేక్షకులు ఏ ఎలిమెంట్స్ ఆశిస్తారో అవి అన్ని ఉన్నాయి. అలాగే పలు డైలాగ్స్ కానీ ఎమోషనల్ సీన్స్ లో కానీ తన పెర్ఫామెన్స్ నీట్ గా కంపోజ్డ్ నటించాడు.
ఇక నటి ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో తన రోల్ లో ఇంప్రెస్ చేస్తుంది. ఓ డీసెంట్ పాత్రలో అందులోని తనలోని కొత్త కోణం ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే నరేష్ తో తెరపై ఇద్దరి ప్రెజెన్స్ వారి నడుమ సన్నివేశాలు బాగున్నాయి.
ఇక వీరితో పాటుగా హర్ష చెముడు, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రకి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
గోపి సుందర్ మ్యూజిక్ బాగానే ఉంది. ముఖ్యంగా రాజాధి రాజా పాట చాలా బాగుంది. BGM అయితే ఒకే అనెల ఉంది కానీ అంతగా ఆకట్టుకొదు.
సూర్యా సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా చోట్ల నరేష్ చాలా అందంగా కనిపించాడు.
చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
“ఆ ఒక్కటీ అడక్కు” సినిమా లో అల్లరి నరేష్ నుంచి కావాల్సిన అల్లరి చాలా కాలం తర్వాత ఈ సిన్మా తో కొంత దొరికింది అనిపిస్తుంది, కానీ పూర్తిగా దొరకలేదు. నరేష్ కామిడీ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించాడు.
తనతో పాటుగా ఫరియా అబ్దుల్లా కూడా తన పాత్రలో ఒదిగి మెప్పిస్తుంది. ఆ ఒక్కటి అడక్కు అంటూ ఫన్ జోనర్ లో తీసినా డీసెంట్ కామెడీ కోసం సీన్స్ వెతుక్కోవాలి. కధ యూత్ కి మంచి మెసేజ్ లా ఉన్నా ప్పవర్తి స్థాయిలో కథనం (స్క్రీన్ -ప్లే) ఆకట్టుకోదు.
చాలా సీన్స్ స్లోగా, లాజిక్ లేకుండా ఉన్నాయి. మంచి సోషల్ మెసేజ్ ఉన్నా దర్శకుడు ఇంకాస్త మెరుగ్గా కథనం (స్క్రీన్ – ప్లే) నడిపించి ఉంటే బాగుండేది. EVV – రాజేంద్ర ప్రసాద్ కాంబో లో 1992 లో వచ్చిన క్లాసిక్ ఆ ఒక్కటి అడక్కు సినిమా లొని ఫన్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ 2024 ఆ ఒక్కటి అడక్కు సినిమా చూడకుండా, కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని చూస్తే ఈ సినిమా ఓక సెక్షన్ ప్రేక్షకులను దియేటర్స్ లో అలరించవచ్చు.
