Aa Okkati Adakku Movie Producer Special Interview: ‘ఆ ఒక్కటీ అడక్కు’ అందరూ కనెక్ట్ అయ్యే కథ: నిర్మాత రాజీవ్ చిలక!

Aa Okkati Adakku Movie Producer Special Interview e1714141070904

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు‘ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత రాజీవ్ చిలక మా 18F మూవీస్ విలేకరితో సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని నిర్మించడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి?

సినిమాలు నిర్మించాలనే దీర్గకాలిక ప్రణాళికతో పరిశ్రమలోకి వచ్చాను. మంచి కథ కోసం చూస్తున్నపుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పారు. పెళ్లి అనేది అందరూ రిలేట్ చేసుకునే అంశం. ఈ కథలో కామెడీ, ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ఈ జోనర్ సినిమా మా మొదటి సినిమాగా సెట్ అవుతుందని భావించాం.

Aa okkati adakku trailer launch highlights 1 1

యానిమేషన్ రంగంలో చాలా కాలంగా వున్నారు కదా.. సినిమా రంగంలోకి రావడానికి ఇంత కాలం ఎందుకు పట్టింది?

యానిమేషన్ రంగం చాలా కష్టంతో కూడుకున్నది. ముందు కంపెనీని సుస్థిరం చేసే దిశగా పని చేశాం. మా దగ్గర దాదాపు ఎనిమిది వందల మంది ఉద్యోగులు పని చేస్తారు. వారందరికీ జీతాలు ఇవ్వడం మామూలు విషయం కాదు. అయితే సినిమాలు చేయాలని ఎప్పటినుంచో వుంది. దాదాపు ఆరు యానిమేషన్ చిత్రాలు చేశాం. కంపెనీ స్థిరపడిన తర్వాత సినిమాల్లోకి రావాలని భావించాం. ఈ క్రమంలో కొంత సమయం పట్టింది. ఇకపై వరుసగా సినిమాలని నిర్మిస్తాం.

చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌ గురించి ?

నా పూర్తి పేరు రాజీవ్ చిలకలపూడి. 2018లో పేరుని రాజీవ్ చిలక అని కుదించాను. ఆ పేరు బాగా కలిసొచ్చింది. ఛోటా భీమ్ పెద్ద హిట్ అయ్యింది. బ్యానర్ కి ఏం పేరు పెట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా పేర్లు సూచనలుగా వచ్చాయి. అయితే చిలక పేరు పాజిటివ్ గా వుందని అదే పేరుతో చిలక ప్రొడక్షన్స్ ని ప్రారంభించడం జరిగింది.

aa okkati adakku teaser launch highlights 1

ఈ కథ విన్నాకా మొదట నరేష్ గారినే అనుకున్నారా?

ఫస్ట్ అల్లరి నరేష్ గారినే అనుకున్నాం. ఈ కథ విన్నాక మొదట మైండ్ లోకి వచ్చిన రాజేంద్రప్రసాద్ గారు. యంగ్ గా వుంటే ఆయన పర్ఫెక్ట్. ఇప్పుడైతే ఈ కథ నరేష్ గారికే యాప్ట్. నరేష్ గారికి ఈ కథ చాలా నచ్చింది. మేము కథ చెప్పినపుడు ఆయన రెండు సినిమాలతో బిజీగా వున్నారు. ఆయన కోసం వెయిట్ చేసి తీశాం.

మీ మొదటి సినిమాకే పెళ్లి సబ్జెక్ట్ ని ఎంచుకోవడానికి కారణం ?

ఇది అందరూ రిలేట్ అయ్యే సబ్జెక్ట్. రిలేట్ చేసుకునే ప్రాబ్లం. పెళ్లి అనేది నేటి రోజుల్లో తన ఒక్కడికే సమస్య, తనకే పెళ్లి కావడం లేదనే ధోరణితో చాలా మంది మానసికంగా క్రుంగుబాటుకి గురౌతున్నారు. ఈ రోజుల్లో సెటిల్ అవ్వడం కంటే పెళ్లి అవ్వడం పెద్ద టాస్క్ గా మారింది. ఒకప్పుడు బంధవులు, చుట్టాలు చుట్టుపక్కల ఉంటూ వాళ్ళే పెళ్లి సంబధాలు చూసే వారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి.

ఒకొక్కరూ ఒకొక్క రాష్ట్రంలో, దేశంలో వుంటున్నారు. పెళ్లి కోసం వెబ్ సైట్స్ పై ఆధారపడుతున్నారు. మ్యాట్రీమొనీ సైట్స్ ద్వారానే లక్షల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పైగా ఇందులో ఒకరిగురించి ఒకరికి తెలీయదు కూడా. జీవితానికి సంబధించిన పెద్ద నిర్ణయాన్ని ఇలా తీసుకుంటున్న పరిస్థితి వుంది. ఇది నేడు యువత ఎదుర్కొంటున్న సమస్య. అందరూ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఈ కథ చాలా వినోదాత్మకంగా చెప్పాం. కామెడీ, డ్రామా, హ్యుమర్ , సాంగ్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వచ్చాయి.

aa okkati adakku teaser launch highlights 3

‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ గురించి ?

కొన్ని టైటిల్స్ అనుకున్నాం కానీ సరిగ్గా సెట్ కాలేదు. అలాంటి సమయంలో నరేష్ గారే ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ సూచించారు. నిజానికి ఈ కథకు యాప్ట్ టైటిల్ ఇది. ఇందులో హీరోని అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటారు. దీంతో ఇరిటేషన్ లో హీరో పలికే సహజమైన డైలాగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ టైటిల్ పెట్టడం పెద్ద బాధ్యత.

నరేష్ నాన్నగారి క్లాసిక్ సినిమా అది. నరేష్ గారికి ఇంకా భాద్యత వుంది. కథ, అవుట్ పుట్ అన్నీ చూసుకున్నాక సినిమా టైటిల్ డిసైడ్ చేయమని కోరాం. నరేష్ గారు సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలై టైటిల్ వాడుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు.

aa okkati adakku teaser launch highlights 4

ఈ కథలో ట్విస్ట్ లు ఉన్నాయా ?

ఇందులో కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్ లు వున్నాయి. స్క్రీన్ ప్లే కథలో లీనం చేస్తుంది. ఆద్యంతం ప్రేక్షకులని హోల్డ్ చేస్తుంది.

దర్శకుడిగా మల్లి అంకంను ఎంపిక చేయడానికి కారణం?

తను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. దాదాపు ఇరవై ఏళ్ళుగా పరిశ్రమలో వున్నారు. నాకు ముందు నుంచి పరిచయం వుంది. తను అనుకున్న కథని చాలా అద్భుతంగా తీశాడు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ?

నరేష్ గారు హైట్ ఎక్కువ వుంటారు. నిజానికి ఆయన ఎత్తుకి చాలా మంది హీరోయిన్స్ సరిపోరు. ఆయన హైట్ ని మ్యాచ్ చేయడానికి ఫారియా అయితే బావుంటుందనిపించింది. అలాగే ఫారియా కామెడీ టైమింగ్ కూడా బావుటుంది. ఈ కథ నచ్చి ఫారియా ప్రాజెక్ట్ లోకి వచ్చారు. అలాగే జానీ లీవర్ గారి అమ్మాయి జెమి లివర్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. దీంతో పాటు మురళి శర్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష వీరందరి పాత్రలు వినోదాత్మకంగా వుంటాయి.

గోపిసుందర్ మ్యూజిక్ గురించి ?

మ్యూజిక్ కు చాలా ప్రాధాన్యత ఇస్తాం. అందుకే గోపి సుందర్ గారిని ఎంపిక చేశాం. సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. నేపధ్య సంగీతంలో ఎమోషన్ అద్భుతంగా పండింది.

Aa Okkati Adakku Movie Producer Special Interview e1714141070904

యానిమేషన్స్ లో కొత్త ప్రాజెక్ట్స్ ?

ఛోటా భీమ్ ని రియల్ పిల్లలతో చేయబోతున్నాం. అలాగే డిస్నీలో ఒక యానిమేషన్ షో లాంచ్ కాబోతుంది. అది ఛోటా స్టార్ట్ అఫ్ గా చేస్తున్నాం. చాలా ఫన్ గా వుంటుంది. మే6న లాంచ్ కాబోతుంది.

నిర్మాతగా ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ?

మంచి ఫ్యామిలీ సినిమాలు తీయాలని వుంది. అలాగే ఫాంటసీ, హిస్టారికల్, కామెడీ జోనర్స్ చేయాలని వుంది.

ఒకే థాంక్యు అండ్ అల్ ది బెస్ట్ రాజీవ్ గారూ.,

    * కృష్ణ ప్రగడ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *