ఆ గ్యాంగ్ రేపు 3′ ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే !

gr 3 scaled e1752323504607

ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందిన ‘ఆ గ్యాంగ్‌ రేపు’తో పాటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన స్వీకెల్‌ చిత్రం ‘ఆ గ్యాంగ్‌ రేపు-2’ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించిన టీమ్‌ నుండి రాబోతున్న మరో సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఆ గ్యాంగ్‌ రేపు-3’ త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

దర్శకుడు యోగీ కుమార్‌ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ లవ్‌ యూ టూ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సారి ఈ ఆ గ్యాంగ్‌ రేపు-3 ఆయనకు దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు.

Gang rape 3 1

 

 నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి, హ్యాండ్ హెల్డ్ స్టైల్ చిత్రీకరణ చేసిన సినిమాటోగ్రాఫర్ నాని ఐనవెల్లి విజువల్స్ మరింత ఎంగేజింగ్ గా ఉంటాయి. కథన వేగం, మూడ్‌ను ఖచ్చితంగా నిలబెట్టిన ఎడిటర్ అనిల్ కుమార్ జల్లు కట్ ఈ సినిమా టెన్షన్‌ను అద్భుతంగా పటిష్టం చేసింది.

gang rape 3

 2017లో మొదటి SIIMA షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు, కన్నడ హిట్ షుగర్ ఫ్యాక్టరీకి సంగీతం అందించిన కబీర్ రఫీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ మరియు విడుదల తేదీ త్వరలో ప్రకటించబడనుంది! కంటెంట్ ట్రైలర్ జూలై 16న విడుదల కానుంది. పూర్తి విడుదల కోసం అప్‌డేట్స్ కోసం ఎదురుచూడండి!

నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌, సందీప్‌ సాండిలియా, దయానంద్‌ రెడ్డి, మహిపాల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్‌: సహచర ప్రొడక్షన్స్‌, నిర్మాత: నోక్షియస్‌ నాగ్స్‌, దర్శకుడు: యోగేష్‌ కుమార్‌, డీఓపీ: నాని ఐనవల్లి, సంగీతం: కబీర్‌ రఫీ, ఎడిటర్‌: అనిల్‌ కుమార్‌ జల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *