మూవీ: జవాన్(Jawan Movie):
విడుదల తేదీ :సెప్టెంబర్ 7, 2023
నటీనటులు: షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె (ప్రత్యేక పాత్ర) ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, రిద్ధి డోగ్రా, అస్తా అగర్వాల్, సంజీత భట్టాచార్య, సంజయ్ దత్ (అతిధి పాత్ర) తదితరులు.
దర్శకుడు : అట్లీ
నిర్మాతలు: గౌరీ ఖాన్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: జీ.కె. విష్ణు
సహా నిర్మాత : గౌరవ్ వర్మ
ఎడిటర్: రూబెన్
జవాన్ మూవీ రివ్యూ:
కింగ్ ఖాన్ ‘షారుఖ్ ఖాన్’ కింగ్ సైజ్ కమ్ బ్యాక్ గా వచ్చిన పఠాన్ చిత్రం వచ్చిన ఏడాది లోపే మరో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కధ తో తమిళ దర్శకుడు అట్లీ ని హిందీ చిత్ర సీమకు పరిచయం చేస్తూ చేసిన జవాన్ సినిమా కృష్ణాష్టమి సంధర్బంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే అన్నీ భాషలలోని సినీ ప్రేక్షకులలోనూ ట్రైలర్ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకోని సిన్మా పై మంచి అంచనాలు క్రియేట్ చేసి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేసింది. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో మా 18f మూవీస్ సమీక్షలోకి వెళ్లి చదివి తెలుసుకుందా మా !
కథ ని పరిశీలిస్తే (Story line):
మహిళలు ఉండే జైల్ కి అధికారి అయిన ఆజాద్ (షారుఖ్ ఖాన్) సమాజంలోని అన్యాయాలకు, అక్రమాలకు గురైన కొందరి మహిళా ఖైదీలకు గైడ్ గా, మెంటర్ గా మారి వ్యవస్థలోని లోపాలను రాబిన్ హూడ్ తరహా లో విక్రమ్ రాథోడ్ అనే పాత్ర తో సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. అందుకు అనుగుణంగా తన జైల్ లొని కొందరి మహిళలతో ఓక టీమ్ ఏర్పాటు లచేసి రాజకీయ నేతలను, కరప్ట్ వ్యాపారవేత్తను టార్గెట్ చేసి సంఘ విద్రోహ పనులు చేస్తూ రైతులకు, పేద ప్రజలకు సహహాయం చేస్తుంటాడు.
ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలలో
ఆజాద్ విక్రమ్ రాథోడ్ గా ఎందుకు మారాడు ?
ఆజాద్ ఎవరికోసం సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నాడు ?,
ఆజాద్ టీమ్ ను పట్టుకోవడానికి ఆఫీసర్ నర్మదా టీమ్ చేసే ప్రయత్నం ఏమిటి ?,
చివరికి ఆజాద్ టీమ్, నర్మదా నుంచి ఎలా తప్పించుకుంటుంది ?,
అసలు ఆజాద్ ని పట్టుకొనే టైమ్ లో నర్మద ఆజాద్ ని ఎందుకు పెళ్లి చేసుకోంది ?,
నర్మద కు విక్రమ్ రాథోడ్ ఆజాద్ ఒక్కరే అని తెలిసిన తర్వాత ఏమి చేసింది?
ఇంతకీ అసలు విక్రమ్ రాథోడ్ (షారుఖ్ ఖాన్) ఎవరు ?,
విక్రమ్ రాథోడ్ గతం ఏమిటి ?, ప్రస్తుతం ఏమి చేశాడు ?
విక్రమ్ రాథోడ్ – ఆజాద్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?,
ఐశ్వర్య – విక్రమ్ రాథోడ్ – ఆజాద్ మద్య సంభందం ఏమిటి ?
ఈ జవాన్ కథ ఎలా మొదలై ఎలా ముగిసింది ?
అనే ప్రశ్నలు మీమ్మాలను ఆకట్టుకొంటే ఆలస్యం చేసేయకుండా టిక్కెట్స్ బుక్ చేసుకొని వెంటనే ఈ జవాన్ సిన్మా చూసేయండి.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
జవాన్ కథలో సోషల్ మెసేజ్ ఉన్నా కమర్షియల్ గా కధనం (స్క్రీన్ – ప్లే) రాసుకొన్న విదానం బాగుంది. మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) లో వచ్చే మొదటి 30 మినేట్స్ ఎపిసోడ్ అయితే సినిమా కి పెద్ద అసెట్ అని చెప్పవచ్చు.
మెయిన్ విలన్ కాళీ గైక్యాడ్ (విజయ్ సేతుపతి) పాత్ర కొంచెం ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. విజయ్ సేతుపతి ఎంత బాగా నటించినా కల్పిత పాత్రలా తెలిపోతుంది. గెడ్డం, హెయిర్ విగ్గు పెట్టినట్టు తెలిసిపోతుంది. దీనికి తోడు కొన్ని సీన్స్ లో డ్రామా ఎక్కువడంతో ఆ సీన్స్ లో సహజత్వం లోపించింది.
దర్శకుడు అట్లీ రెండవ అంకం (సెకండాఫ్) ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడపటానికి మంచి కధనం రాసుకొన్నా ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేసి బిల్డప్ షాట్స్ కి ఎక్కువ ప్రదాన్యం ఇవ్వడం వలన సహజ సినిమా లవర్స్ కి ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా నచ్చక పోవచ్చు.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
అట్లీ దర్శకత్వం, కథలోని ప్రధాన పాత్రల చిత్రీకరణ బాగున్నాయి. ముఖ్యంగా అట్లీ తీసుకున్న కధ థీమ్, కధనం లో రాసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్ మెయిన్ గా హై వోల్టేజ్ డ్రామా అండ్ ఎమోషన్స్ తో పాటు చెప్పిన మెసేజ్ కూడా చాలా బాగా ఉంది.
షారుఖ్ ఖాన్ అప్పిరెన్స్ ,యాక్షన్ ఎలివేషన్స్ తో పాటు కింగ్ ఖాన్ కామెడీ టైమింగ్ మరియు కథలోని మెయిన్ ఎమోషన్ అండ్ మెసేజ్ కూడా చాలా బాగుంది. అలాగే, విక్రమ్ రాథోడ్ పాత్రలోని షేడ్స్ ను, ఆజాద్ (షారుక్ ఖాన్) – నర్మదా (నయనతార) మధ్య సాగే సీన్స్ ను, ఆ ప్లాష్ బ్యాక్ లోని విక్రమ్ రాథోడ్ (సీనియర్ షారుఖ్) క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను దర్శకుడు అట్లీ చాలా బాగా తీర్చిదిద్దారు.
యంగ్ షారుఖ్ (ఆజాద్) పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు కూడా విశేషంగా అలరిస్తాయి. ఇక రెండు పాత్రలకు (ఆజాద్ – విక్రమ్ రాథోడ్) షారుఖ్ ఖాన్ ప్రాణం పోశారు. రఫ్ అండ్ మాస్ అవతార్ లో షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించారు.
నయనతార పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటన సినిమా కు మరో పెద్ద అసెట్. షారుక్ ఖాన్ సరసన నటిస్తూ హిందీ ప్రేక్షకులకు పరిచయం అవ్వడం కూడా పెద్ద ప్లస్ పాయింట్.
దీపికా పడుకోణె – షారుక్ ఖాన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. దీపికా పాత్ర నిడివి చిన్నది అయిన చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర.
విజయ్ సేతుపతి కూడా పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. చివరిలో సంజయ్ దత్ కూడా అతిధి పాత్రలో మెప్పించాడు.
ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, రిద్ధి డోగ్రా, అస్తా అగర్వాల్, సంజీత భట్టాచార్య ఇలా ప్రతి ఒక్కరూ చాలా సెటిల్డ్ గా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు, పాత్రల పరీఛాయానికి సీన్స్ ని హై వోల్టేజ్ లో చూపించడానికి చాలా ప్లస్ అయ్యింది. సాంగ్స్ కూడా ఆకట్టుకొనే విదంగా ఉన్నాయి.
జీ.కె. విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరా వర్క్ , విజువల్ రిచ్ నెస్ చాలా బాగుంది.
జవాన్ సినిమా నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు అట్లీ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. ఐతే, ఉత్కంఠభరితమైన కథనాన్ని ఇంకా ఎఫెక్టివ్ రాసుకుని ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.
18F మూవీస్ టీం ఒపీనియన్:
కింగ్ ఖాన్ షారుఖ్ అభిమానులకు కి ఫుల్ కిక్ ఇచ్చే ఈ జవాన్ సినిమా అట్లీ హై వోల్టేజ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మలిచిన తీరు అమోఘం. జవాన్ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఇంట్రస్ట్ గా సాగుతూ గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు షారుఖ్ యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్ చాలా బాగున్నాయి. కాకపోతే, కధ లొని రివెంజ్ సన్నివేశాలు గతం లో వచ్చిన సినిమా సీన్స్ లాగే అనిపిస్తాయి.
కానీ కధ లో సీన్స్ పాతవే అయినా కధనం తో దర్శకుడు అట్లీ అద్భుతంగా మాలిచాడు. మొత్తంగా చూస్తే ఈ సినిమా సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. షారుఖ్ ఫ్యాన్స్ కి ఫుల్ పూనకాలను ఇస్తోంది. జవాన్ సినిమా బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూసి ఎంజాయ్ చేసే సినిమా.
టాగ్ లైన్: సౌత్ మసాలా తో నార్త్ బిర్యానీ వండిన అట్లీ !
18FMovies రేటింగ్: 3.5 / 5
* కృష్ణ ప్రగడ.