చిత్రం: భరతనాట్యం
విడుదల తేదీ : ఏప్రిల్ 5, 2024,
నటీనటులు: సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్ష వర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్ బాలకృష్ణ తదితరులు..,
దర్శకుడు: కేవీఆర్ మహేంద్ర ,
నిర్మాత: పాయల్ సరాఫ్ ,
సంగీత దర్శకులు: వివేక్ సాగర్ ,
సినిమాటోగ్రాఫర్: వెంకట్ ఆర్ శాకమూరి,
ఎడిటింగ్:
మూవీ: రివ్యూ ( Movie Review)
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్లను పరిచయం చేస్తూ ‘దొరసాని’ లాంటి పీరియాడికల్ లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయం సాధించిన డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర చాలా గ్యాప్ తర్వాత తాజాగా తన రెండో సినిమాగా ‘భరతనాట్యం’తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
డెబ్యూ హీరో హీరోయిన్ అయిన సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా మరో డెబ్యూ నిర్మాత పాయల్ సరాఫ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ భరతనాట్యం సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
హీరో రాజు సుందరం(సూర్య తేజ ఏలే) సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ మరోపక్క డైరెక్టర్ అవ్వాలని తెలిసిన ప్రొడ్యూసర్స్ అందరికీ కధలు చెప్తూ ఉంటాడు . ఊర్లో ఉంటున్న అమ్మా- నాన్నలకు హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు అవశ్యం వచ్చి ఏదైనా పని షార్ట్ కట్ లో చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఎదురుచూస్తూ ఉంటాడు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పటికీ అతని వద్ద డబ్బు కి కష్టం వచ్చినప్పుడల్లా తన గర్ల్ ఫ్రెండ్(మీనాక్షి గోస్వామి) దగ్గర అప్పు తీసుకొంటూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోమని పట్టుబడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజు సుందరం ఏదైనా తప్పుడు మార్గం లోనైనా ఎక్కువ మొత్తం లో డబ్బు సంపాదించాలి అని ఓక మాస్టర్ ప్లాన్ వేస్తాడు.
సిటీ లో మరో పక్క కారుడుగట్టిన రౌడీ బ్రదర్స్ ఐన దిల్ షుఖ్ నగర్ దామోదర్(హర్షవర్ధన్), రంగమతి(టెంపర్ వంశీ) లు అక్రమంగా డ్రగ్స్ అమ్ముతూ ఉంటారు. తమ్ముడూ రంగమతి పార్టీ తో డీల్ సేత చేసుకొని డ్రగ్స్ ఉన్న భగతనాట్యం బ్యాగ్ ను డబ్బులు ఉన్న బ్యాగ్ తో మార్చుకొనే టైమ్ లో హీరో ఓక బ్యాగ్ కొట్టేసి పారిపోతాడ .
తర్వాత అది డ్రగ్స్ బ్యాగ్ అని తెలిసి వదిలించుకునే ప్రాసెస్ లో శకుని(అజయ్ ఘోష్) అనే పోలీస్ కి దొరికిపోతాడు.
ఆ డ్రగ్స్ బ్యాగ్ ని రాజు సుందరం ఏం చేసాడు?
డ్రగ్స్ కొట్టేసినందుకు రాజుని దివాకర్ గ్యాంగ్ ఏం చేశారు?
మధ్యలో హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన భుషే(వైవాహర్ష) కథేంటి?
పోలీసుల నుంచి రాజు ఎలా తప్పించుకున్నాడు ?
తన ప్రియరాలుతో పెళ్లి జరిగిందా ?
చివరికి అతని ఫ్యామిలీ ఏమైంది?
ఓ పక్క దామోదర్ ఇంకో పక్క శకుని మద్య రాజు సుందరం ఎలా తప్పుకున్నాడు?
అనే ప్రశ్నలు మీకు నచ్చితే వాటి జవాబుల కోసం దియేటర్ కి వెళ్ళి సినిమా చూసేయండి. అప్పటి వరకూ మా మొత్తం సమీక్ష చదివేయండి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
ఈ భరతనాట్యం కధ ను యువ హీరో సూర్య తేజ వ్రాసుకొన్నా, కధనం (స్క్రీన్ – ప్లే) మాత్రం దర్శకుడు మహీంద్రా, కధ-రచయిత సూర్య తేజ కలిపి వ్రాసినట్టు మనకు టైటిల్ కార్డ్స్ లో కనిపిస్తుంది. ఇలాంటి క్రైమ్ కామిడీ కధాలకు పకట్బందీ కధనం చాలా అవసరం. లేకపోతే డార్క్ కామిడీ కాస్తా మరి డార్క్ సినిమా అయిపోతుంది.
ఈ భరతనాట్యం కోసం వ్రాసుకొన్న కధ పాయింట్ చిన్నదే అయినా కధనం తో ఎంతో ప్లే చేయవచ్చు. కానీ దర్శకుడు చాలా లిమిటెడ్ గా ప్లే కొనసాగించాడు. చాలా సీన్స్ మాత్రం ఎందుకు ఇరికించారో తెలియదు. నటి నటుల ఫెర్ఫర్మెన్స్ కూడా బాగాలేదు.
రాసుకొన్న పాత్రల స్వబావం కూడా సేత కాలేదు. వైవా హర్ష పాత్ర చాలా వెటకారంగా ఓవర్ యాక్షన్ తో సాగింది. అలానే దివాకర్ పాత్ర కూడా సాగింది. హీరో కధ రచయిత కొత్తవాడే అయినా దర్శకుడు మహీంద్రా మాత్రం ఓక చక్కని సినిమా తీసి ఉన్నారు.
దొరసాని సిన్మా చేసిన మహీంద్రా నేనా ఈ భరతనాట్యం సినిమాకి దర్శకత్వం చేసింది అనిపిస్తుంది. పూర్ శ్రీం -ప్లే తో స్లో సీన్స్, ఓవర్ డ్రామటిక్ సీన్లు తో సినిమా మొత్తం బోర్ కొట్టించారు అని చెప్పవచ్చు.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు KVR మహేంద్ర దొరసాని లాంటి బ్యూటిఫుల్ పిరియాడిక్ సినిమా తీసి, చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని చేసిన ఈ భరతనాట్యం సినిమా తనే తీశారంటే మాత్రం నమ్మలేము. క్రైమ్ కామిడీ అని చెప్పి చాలా రొటీన్ ఓల్డ్ స్కూల్ ఫార్మెట్ లో తీసినట్టు ఉంది. మాములు క్రైం కథే అయినా దానికి డార్క్ కామెడీ ట్రై చేస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా ల్యాగ్ అనిపిస్తుంది.
కొత్తవాడైనా సూర్యతేజ బాగానే యాక్ట్ చేసాడు. కానీ ఇంకా డైలాగ్స్ డెలివరీ మాడ్యులేసన్ లో తర్ఫీదు తీసుకొంటే మంచిది.
హీరోయిన్ మీనాక్షి గోస్వామి మాత్రం గెస్ట్ పాత్రలా అప్పుడప్పుడు వచ్చి మెరిపించి హిందీ, తెలుగు మిక్సింగ్ భాషలో మాట్లాడి వెళ్ళిపోతుంది.
వైవా హర్ష ఈ సినిమాలో హీరో అవ్వాలనే పాత్రలో ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిగా మాత్రం బాగా మెప్పిస్తాడు. అతని వల్లే కాసేపైనా నవ్వుకుంటాము. ఓ రకంగా చెప్పాలంటే వైవా హర్షనే సెకండ్ హాఫ్ ఎక్కువగా నడిపిస్తాడు. కానీ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది.
పోలీసాఫీసర్ గా అజయ్ ఘోష్, దిల్‌షుఖ్ నగర్ దివాకర్ గా హర్షవర్ధన్, అతని తమ్ముడిగా టెంపర్ వంశీ పాత్రల పరిడి మేరకు నటించి మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ ఒకే లా అనిపిస్తుంది. సాంగ్స్ ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వవు. కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM)మాత్రం పర్లేదు అనిపిస్తుంది.
వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం మాములు కెమెరాతో తీసినట్టు ఉంటాయి. విజువల్స్ మాత్రం కొన్ని చోట్ల చాలా ల్యా గ్ తో విసుకు పుట్టిస్తాయి.
పాయల్ సరాఫ్ నిర్మాతగా ఈద్ డెబ్యూ మూవీ అయినా, చిత్ర నిర్మాణ విలువలు గురించి చూస్తే, కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి, ఉన్న తక్కువ బడ్జెట్లో పర్లేదు అనిపించారు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
భరతనాట్యం అని టైటిల్ పెట్టి డ్రగ్స్ తో కూడిన క్రైం కామెడీ సినిమా తీశారు. సినిమాలో అన్ని చోట్ల భరతనాట్యం బదులు భగతనాట్యం అనే వినిపిస్తుంది. సెన్సార్ వాళ్ళు ఓ డ్రగ్ కి భరతనాట్యం అనే పేరు పెడితే అభ్యంతరం తెలిపితే భగతనాట్యం అని మళ్ళీ మార్చినట్టు దర్శకుడు వివరణ ఇచ్చారు.
ఈ భరతనాట్యం సినిమా చూస్తున్నంతసేపు అసలు ఇది దొరసాని డైరెక్ట్ చేసిన KVR మహేంద్ర నే దర్శకత్వం వహించిన సినిమానేనా అనిపిస్తుంది. మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) అంతా పాత్రల పరిచయంతోనే సాగుతుంది, అసలు కథేంటి అనేది ఇంటర్వెల్ వరకు కూడా అర్ధం కాదు. దానికి తోడు స్లో నేరేషన్. డార్క్ కామెడీ ట్రై చేసినా అస్సలు వర్కౌట్ అవ్వలేదు.
మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) అంతా రాజు సుందరం, దిల్ షుఖ్ నగర్ దివాకర్ గురించి మిగిలిన పాత్రల గురించి చూపించి డబ్బుల కోసం హీరో దొంగతనానికి సిద్దపడి బ్యాగ్ ఎత్తుకొచ్చి చూస్తే అందులో డ్రగ్స్ చూపిస్తూ ఇంటర్వెల్ బ్రేక్ ఇవ్వడం తో రెండవ అంకం (సెకండ్ ఆఫ్) పై ఆసక్తిగా పెరుగుతుంది. కానీ దర్శకుడు, కధా రచయిత రెగ్యులర్ రొటీన్ ఫార్మెట్ క్లైమాక్స్ లోనే ముగిస్తారు.
ఎంతో ఓపిక ఉంటే తప్ప ఈ సినిమాని థియేటర్లో కూర్చుని ఈ భరతనాట్యం మూవీ చూడడం చాలా కష్టం. సీట్లో కుర్చీని ప్రేక్షకులు భరతనాట్యం చేయవలసి వస్తాది.