నాగబాబు ముద్దుల కూతురు నీహారిక ఇప్పుడు నటన మీద ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ మధ్య వార్తలలో వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మెగా డాటర్ ఇప్పుడు ఆ పాపులారిటీ ని దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ గా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్టు కృష్ణా నగర్ టాక్.
మల్లువుడ్ లో గుర్తుంపు ఉన్న నటుడు షేన్ నిగమ్ తన కోలీవుడ్ అరంగేట్రం కోసం చేస్తున్న మద్రాస్‌కారన్ చిత్రం తో ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మద్రాస్ కారన్ సినిమా లో హీరోయిన్ గా మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తుండగా, వాలి మోహన్ దాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నీహారిక ఈ మద్య తన ఇన్‌స్టా లో ప్రశ్నోత్తరాల సెషన్ చేస్తూ తను తమిళ సినిమా మద్రాస్‌కారన్ షూటింగ్ లో వచ్చే ఆదివారం అంటే మార్చి 17, 2024 నుండి షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం నిహారిక కొణిదెల ఆహా వీడియో యొక్క చెఫ్ మంత్ర సీజన్ 3 మరియు మంచు మనోజ్ యొక్క వాట్ ది ఫిష్ షూటింగ్‌లో బిజీగా ఉంది. త్వరలోనే మద్రాస్‌కారన్ ఘాట్ లో జాయిన్ అవబోతుంది. మాకు అందిన సమాచారం చూస్తే ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల స్క్రిప్ట్స్ చదువుతుంది అని తెలిసింది. వాటికి త్వరలోనే పచ్చజెండా ఉపవవచ్చు అని ఆ చిత్ర యూనిట్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
నిహారిక కొణిదెల కు సోషల్ మీడియా లో ఉన్న పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని కొందరు నిర్మాతలు తనతో ఎలాగైనా తమ సినిమాలలో నటింప చేస్తే మినిమం గ్యారంటీ ఉంటుంది అని గట్టిగా నమ్ముతున్నారు.
చూడాలి నీహారిక ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు చేస్తుందో.. నిహారిక మరియు ఆమె రాబోయే చిత్రాల గురించి మరిన్ని ఉత్తేజకరమైన అప్డేట్‌ల కోసం మా 18F మూవీస్ వెబ్ సైటు చూస్తూ ఉండండి.