Rajadhani Files Movie Review & Rating : కాశ్మీరీ ఫైల్స్, కేరళ ఫైల్స్ లానే రాజధాని ఫైల్స్ హిట్టా !లేదా ఫట్టా !

Rajadhani Files movie review by 18F Movies 1 e1708079913562

మూవీ: రాజధాని Files 

విడుదల తేదీ : ఫిబ్రవరి 15, 2024

నటీనటులు: అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, విశాల్ పట్నీ, షణ్ముఖ్, మధు, అజయ్ రత్నం, అమృత చౌదరి, అంకిత ఠాకూర్

దర్శకుడు : భాను,

నిర్మాత: కంఠమనేని రవిశంకర్,

సంగీత దర్శకులు: మణిశర్మ,

సినిమాటోగ్రాఫర్‌లు: రమేష్,

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,

రాజధాని Files  రివ్యూ (Rajadhani Files Review):

పొలిటికల్ మూవీస్ అంటే రిలీజ్ కి ముందు సెన్సార్ ట్రబుల్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకొన్నా, తమ ఇమేజ్ కి నష్టం జరుగుతుంది అని కోర్టులకు వెళ్ళి స్టే వర్దర్ తెచ్చుకొనేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పొలిటికల్ డ్రామా “రాజధాని ఫైల్స్” కి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.

ఈ చిత్ర నిర్మాతలు ఈ వారం అంటే ఫెబ్రవరి 15 న విడుదల చేసుకొంటున్నాము అని నాలుగు రోజులు ముందుగానే చెప్పినా కొంతమంది హై కోర్టులో స్టే కోసం వెళ్లారు. కోర్టు తీర్పు రిజర్వ్ చేయడం తో నిన్న అంటే 15 న చాలా దియేటర్స్ లో విడుదల అయ్యింది. కానీ నిన్ననే హై కోర్టు 11.40 am టైమ్ కి వర్దర్ ఇచ్చింది.  చిత్ర ప్రదర్శన నిలిపి సెన్సర్ ప్రొసీడింగ్స్ తీసుకురండి అని చెప్పింది.

ఆధికార పార్టీ వాళ్ళు అదికారం చేతిలో ఉంది కాబట్టి అధికారులను ఆంధ్ర లొని రాజధాని ప్రాంతం, విజయవాడ  ప్రాంతం లొని డీయేటర్స్ కి వెళ్ళి సినిమా ప్రదర్శన శకం అయినా మిగిలిన సగం ప్రదర్శించకూడదు అని ఆపారు. మా హైదరాబాద్ లో మార్నింగ్ షోలు ఏయిన తర్వాత ఆగింది.

మా 18F మూవీస్ టీం కూడా నిన్న ప్రసాద్ ఐమ్యాక్స్ లో అందరి మీడియా తో పాటు చూసినా, కోర్టు వర్దర్ దృష్టిలో పెట్టుకొని మా సమీక్ష పోస్ట్ చెయ్యలేదు.  ఈ రోజు అనగా 16 మార్నింగ్ కోర్టు స్టే కేన్సల్ చేసి ప్రదర్శన చేసుకోండి అని చెప్పడం తో ఇప్పుడు మా రివ్యూ పుబ్లిష్ చేస్తున్నాము.

ఇప్పుడు రాజధాని Files చిత్రం గురించి చూస్తే ప్రముఖ నటుడు వినోద్ కుమార్, ఆలనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్  తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

Rajadhani Files movie review by 18F Movies 5

కధ పరిశీలిస్తే (Story Line): 

ఇక కథ పరిశీలిస్తే వాస్తవిక ప్రాంతాలు, ప్రదేశాలను, పాత్రల పేర్లు ను పెట్టకుండా కొంచం అటూ ఇటూ గా మర్చి సినిమా కధ వ్రాసుకోవడం జరిగింది. మొన్ననే దర్శకుడు భాను మీడియా మీట్ లో ఇది పొలిటికల్ చిత్రం కాదు, ఒక ప్రాంతం లో జరిగిన యాదార్ధ సంఘటనల ఆదారంగా రాసుకొన్న ఎమోషనల్ డ్రామా అని చెప్పారు.

ఇక మెయిన్ కధలోకి వెళ్తే.. బుల్లురు అనే గ్రామానికి చెందిన గౌతమ్(పుష్పరాజ్ అఖిలన్) మొదట అంత ఆసక్తి కనబరచకపోయినప్పటికీ తరువాత అరుణప్రదేశ్ కి చెందిన కొత్త రాజధాని ఐరావతి కోసం ఇచ్చిన భూముల విషయంలో అక్కడి రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వారితో పోరాటం చేయడానికి సిద్ధం అవుతాడు.

మరి అప్పుడే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న (విశాల్ పట్నాని) ఐరావతిని ఒక్కటే రాజధాని కాదని, దీనితో పాటు మరో మూడు ప్రాంతాలలోని పట్టణాలు కూడా రాజధాని గా ఉంటాయి అని  డిక్లేర్ చేయడంతో ఐరావతి రాజధాని రైతులో ప్రభుత్వం తో పోరాటానికి దిగుతారు.

ఈ రాజధాని రైతులు తీసుకున్న నిర్ణయం ఏంటి?

వారికి గౌతమ్ ఎలా సహాయం అందిస్తాడు?

గౌతం తల్లి తండ్రులు ఎవరు ?

ముఖ్యమంత్రి నాలుగు రాజధానులు అందానికి కారణం ఏంటి ?

రైతులు ఏ విధంగా పోరాటం చేశారు?

ప్రబుత్వం తో పోరాటం లో రైతులు విజయమ్ సాదించారా ? లేదా అనేది మిగిలిని కధ. ఈ ప్రశ్నలు కి జవాబులు తెలుసుకోవాలి అంటే ఈ రాజధాని Files సినిమా చూసి తెలుసుకోండి.

Rajadhani Files movie review by 18F Movies 3

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని రాజధాని కోసం నెలకొన్న సంఘటనలతో తీసిన సిన్మా గా ఈ సినిమా కోసం ఆ ప్రాంత రైతులతో పాటు తెలుగు రాస్ట్రం లొని ప్రతి రైతూ ఎంతగానో ఎదురు చూసి ఉండొచ్చు కానీ ఈ సినిమా వారిని కూడా పూర్తి స్థాయిలో మెప్పించే రేంజ్ లో లేదని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఇది ఫిక్షనల్ సినిమా అయినప్పటికీ కొన్ని నిజ జీవిత సంఘటనల ప్రేరణగా కల్పిత సీన్స్ తో దర్శకుడు రాసుకొన్న కధనం (స్క్రీన్ – ప్లే )  అంతగా సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకొదు.

కానీ పొలిటికల్ గా కాకుండా సినిమా చూసే ఆడియెన్స్ కి నచ్చే విధమైన కధ వస్తువు ఉన్నా కధనం (స్క్రీన్ – ప్లే ) లోపం తో ఆడియన్స్ ని ఎంగేజింగ్ నరేషన్ ఈ సినిమాలో లోపించింది. దీనితో రాజధాని ఫైల్స్ లో అసలు ఎమోషన్ అనేది కృత్రిమంగా సాగిపోయింది.

అలాగే ఈ తరహా రియల్ ఇన్సిడెంట్స్ తో చేసే చిత్రాల్లో మెప్పించగల సీనియర్ నటులు చాలా ముఖ్యం. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ పాత్రలకు వారు న్యాయం చేసినా మిగినిలి కొన్ని పాత్రల విషయంలో సినిమాలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వాస్తవిక పాత్రలకి సూటయ్యే నటీనటుల్ని చూపించినా కొంచెం అయినా చూసే ఆడియెన్ కి ఆసక్తి పెరుగును అనిపిస్తుంది.

ఇక సీఎం పాత్రలో కనిపించిన నటుడు విశాల్ పట్నాని పై తీసిన కొన్ని సైలెంట్ సీన్స్ డిజప్పాయింట్ చేస్తాయి.ముఖ్యంగా తను నిర్ణయాత్మకమైన పొజిషన్ లో ఉంది కూడా ఎవరో చెప్పింది ఫాలో అయినట్టు చూపించడం కధన (స్క్రీన్ – ప్లే) లోపమే.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

Rajadhani Files movie review by 18F Movies 2

దర్శకుడు భాను గురించి చెప్పాలి అంటే రాజధాని ఫైల్స్ అనే మంచి ఎమోషన్ ఉన్న రైతుల బర్నింగ్ ఇష్యూ ని తన కధ కి  కంటెంట్ గా తీసుకున్నారు కానీ దగా పడ్డ ఆ రైతుల ఎమోషన్ ని తెరపై ఆవిష్కరించడంలో మాత్రం డిజప్పాయింట్ చేసారని చెప్పాలి.

సినిమా పరంగా చూస్తే ఏవో కొన్ని సీన్స్ వరకు ఓకే కానీ ఫుల్ లెన్త్ సినిమాగా మాత్రం ఇది ఏమాత్రం మెప్పించ లేదు. ముఖ్యంగా గా తెరమీద పాత్రల ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యారు. వాస్తవ సంఘటనలతో ఊహ జనీతమైన సీన్స్ వ్రాసుకొన్నా  వాస్తవ మా కల్పితమా అన్నట్టు గా ఉంది.

అసెంబ్లీ లోకి సామాన్యుడి ప్రవేశం, క్లైమాక్స్ లో జరిగే సన్నివేశం వాస్తవానికి దూరంగా ఉండుట వలన మెయిన్ కధని వదిలి పరిస్కరం కోసం సాహసం చేసినట్టు ఉంది.

ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన సీనియర్ నటుడు వినోద్ కుమార్ అలాగే వాణి విశ్వనాథ్ లు తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనతో ఆకట్టుకుంటారు. అలాగే కొన్ని సీన్స్ లో వారి నటన బాగుంది.

ముఖ్య పాత్రలో కనిపంచిన పుష్పరాజ్ అఖిలన్ తన రోల్ ని మంచి పెర్ఫామెన్స్ తో రక్తి కట్టించాడు అని చెప్పాలి. ఈ సినిమా కి కధ పరంగా ఆయనే హీరో.  మెయిన్ గా రెండవ అంకం (సెకండాఫ్) లోని కొన్ని సన్నివేశాలలో తన పెర్ఫామెన్స్ బాగుంది. ఇక వీరితో పాటుగా ఇతర సహాయక తారాగణం తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. అలాగే కొన్ని సీన్స్ ఈ సినిమా కోసం కేవలం ఆ సీన్స్ కోసం ఎదురు చూసే వర్గానికి నచ్చవచ్చు.

Rajadhani Files movie review by 18F Movies e1708079994548

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

మణిశర్మ మ్యూజిక్ కొంతలో కొంత బాగానే ఉంది అనిపిస్తుంది. కొన్ని సీట్యూవేశనల్ సాంగ్స్ ఆడియో గా వింటున్నప్పుడు కంటే సినిమా లో విజువల్స్ తో కలిపి చూస్తే చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని మంచి  సీన్స్ ని బాగానే ఎలివేట్ చేసింది.

రమేష్  సినిమాటోగ్రఫీ ఓకే, చాలా వరకూ విజువల్స్ బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోను వందా, రెండు వందలు రియల్ రైతులు ఊరి  జనాలతో బాగానే మేనేజ్ చేశారు.

కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఒకే, ఇంకా బెటర్ గా చేయాల్సింది. కాకపోతే ఉన్న స్క్రీన్ రైటింగ్  ప్రకారమే ఫాలో అయినట్టు ఉంది.

నిర్మాత కంఠమనేని రవిశంకర్ గురించి చెప్పాలి అంటే  ప్రస్తుతం ఒక ప్రాంతం లో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ తో  రాజధాని Files  లాంటి చిత్రం నిర్మించాలి అంటే ప్రొడ్యూసర్ కి ధనం తో పాటు ధైర్యం సమాజానికి ముఖ్యంగా దగా బడ్డ రైతులకు ఏదో చేయాలి అనే అభిరుచి ఉండాలి.  చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు.

Rajadhani Files movie review by 18F Movies 4

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

“రాజధాని ఫైల్స్” ట్రైలర్ చూ, గతం లో వచ్చిన కాశ్మీరీ ఫైల్స్సి, కేరళ ఫైల్స్ తరహాలో వాస్తవిక కధతో ఏదోఉంది  అనుకుని దియేటర్ కి వెళ్తే ఇంకేదో అయ్యిందని చెప్పాలి. ప్రధాన తారాగణం నటన పరంగా మెప్పించినా సినిమా స్క్రీన్ మీద అసలు రియల్ కధ (వాస్తవిక సంఘటనల) లొని ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వలేదు.

ఆమెత్యర్ స్క్రీన్ రైటింగ్ తో పాటు డల్ నరేషన్ తో సినిమా ఏమాత్రం రీల్ డ్రామా గా మెప్పించలేకపోయింది. అమరావతి రాజధాని చూట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలలో కొన్ని హృదయానికి అట్టుకొనే సీన్స్ తో  ఈ సినిమాలో ఏదో ఉంటుంది అనుకున్న ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ని కూడా ఎంగేజ్ చెయ్యలేదు.

భూములు ఉన్న ప్రతి రైతుకి కనెక్ట్ అయ్యే పాయింట్ అయినా, అమరావతి రైతులు తప్ప మిగిలిన రైతులు ఎందుకు చూడాలి అనేలా తీశారు. ప్రతి సినిమా ప్రేక్షకుడు రైతు బిడ్డనే అయినా, ప్రస్తుత డిజిటల్ యుగం లో దియేటర్ కి వచ్చి సినిమా చూడాలి అంటే ఏదో ఉండాలి అని కోరుకుని లెక్కలు వేసుకొని సినిమా దియేటర్స్ కి వస్తున్న ప్రస్తుత ఆడియన్స్ కి ఈ రాజధాని Files మూవీ దియేటర్ లో బోరింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

చివరి మాట: ఎమోషన్మిస్సింగ్ files !

18F RATING: 2 .5  / 5

   * కృష్ణ ప్రగడ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *