Ooru peru Bhairavakona Producer Razesh Danda Special Interview :సందీప్ కిషన్ కు, మా బ్యానర్ కు నెంబర్1 సినిమా ‘ఊరు పేరు భైరవకోన’ : నిర్మాత రాజేష్ దండా 

Razesh Danda producer e1707847548776

యువ హీరో సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఈ చిత్రం ఫిబ్రవరి16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాత రాజేష్ దండా ‘ఊరు పేరు భైరవకోన’ విశేషాలని .మా 18F మూవీస్ విలేకరితో సమావేశంలో పంచుకున్నారు. ఆ విశేషాలను మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము.

‘ఊరు పేరు భైరవకోన’ ఎలా మొదలైయింది ?

Razesh Danda producer 4

-సందీప్ కిషన్, నేను, విఐ ఆనంద్ మంచి ఫ్రెండ్స్. డిస్ట్రిబ్యుటర్ గా 12 ఏళ్ల పాటు చేశాను. నిర్మాతగా చేయాలనుకున్నపుడు హాస్య మూవీస్ బ్యానర్‌ లో మొదట అనుకున్న సినిమానే ‘ఊరు పేరు భైరవకోన’. నిర్మాతగా చేయాలనుకున్నప్పుడు కథ కొత్తగా వుంటేనే చేయాలని భావించాను. విఐ ఆనంద్ చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించింది.

ఎప్పుడైనా  కొత్త కంటెంట్ తో కొత్త జోనర్ లో సినిమా చేస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుంది, క్రేజ్ వస్తుందని నమ్మి చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైయింది. సందీప్ కిషన్ గారి కెరీర్ లో హయ్యట్ బడ్జెట్ సినిమా ఇది. అలాగే హయ్యస్ట్ బిజినెస్ సినిమా కూడా ఇదే. విడుదలకు ముందు చాలా హ్యాపీగా వున్నాం. ఆనంద్ గారు చెప్పిన దానికి రెండింతల అద్భుతంగా సినిమాని తీశారు.

బ్యాట్ టు బ్యాక్ హిట్లు కొట్టారు..’ఊరు పేరు భైరవకోన’తో హ్యాట్రిక్ అందుకుంటారనే నమ్మకం ఉందా ?

-నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాం. ‘ఊరు పేరు భైరవకోన’తో సక్సెస్ ట్రాక్ ని కొనసాగించి హ్యాట్రిక్ కొడతామనే నమ్మకం వుంది. ప్రీమియర్ షోలన్నీ ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ లో ప్రముఖ సింగిల్ స్క్రీన్స్ లో ప్రీమియర్స్ అన్నీ ఫుల్ కావడం ఈ సినిమాపై వున్న క్రేజ్ కి అద్దం పడుతున్నాయి.

Razesh Danda producer 6

ఈ కథలో మీకు నచ్చిన పాయింట్?

-‘ఊరు పేరు భైరవకోన’ ఫాంటసీ థ్రిల్లర్. మన ఊర్లో ఏం జరుగుతుందో మనికి తెలుసు. కానీ ‘భైరవకోన’ అనే ఊరులో కొత్తగా వెరైటీగా ఎవరూ ఊహించిన సంఘటనలు జరుగుతుంటాయి. అది నాకు చాలా ఆసక్తిని కలిగించింది. అలాగే గరుడపురాణంలో మిస్ అయిన పేజీలకి ఈ కథకి వున్న లింక్ ఏమిటనేది కూడా చాలా ఆసక్తిగా వుంటుంది. సినిమాలో47 నిమిషాల అద్భతమైన సిజీ వర్క్ వుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా వుంటాయి. ప్రేక్షకులకు చాలా గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చే చిత్రమిది.

అనిల్ సుంకర గారు ఎలాంటి సూచనలు ఇస్తుంటారు ?

Razesh Danda producer 2

-నేను అనిల్ గారు కలసి చేసిన సినిమాల కథలు ముందు నేను విని నచ్చితే అనిల్ గారు వింటారు. విని ఆయన సలహాలు సూచనలు చేస్తారు. ఇందులో కూడా ఆయన ఓ విలువైన సూచనా చేశారు. అది చాలా హెల్ప్ అయ్యింది.

‘ఊరు పేరు భైరవకోన’ కి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు చెప్పారు.?

-డైరెక్టర్ గారు చెబితే ఖచ్చితంగా వుంటుంది. అయితే ఇందులో మాత్రం సీక్వెల్ లీడ్ లాంటి ఏమీ ఇవ్వడం లేదు. ఈ కథకు సీక్వెల్, ప్రీక్వెల్ చేయొచ్చు. రెండు ఆలోచనలు వున్నాయి.

నిజమేనా చెబుతున్నా పాట చాలా పెద్ద హిట్ అయ్యింది కదా.. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర గురించి ?

శేఖర్ చంద్ర తన ప్రతి సినిమాలో చాలా మంచి పాటలు ఇస్తారు. ఇందులో నిజమేనా చెబుతున్న పాట చాలా వైరల్ అయ్యింది. నిజానికి ఈ ట్యూన్ శేఖర్ దగ్గర ఐదేళ్ళుగా వుంది. చాలా మందికి వినిపించాడు. ఫైనల్ సందీప్ కిషన్ విని దర్శకుడికి వినమన్నారు. అలా ఆ పాట మాకు రావడం చాలా లక్కీ. ఇందులో నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది.

‘ఊరు పేరు భైరవకోన’లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న మూమెంట్స్ ?

Razesh Danda producer 1

‘భైరవకోన’ ఊరు గురించి చెప్పడం ఆసక్తికరంగా వుంటుంది. తర్వాత ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా వుంటాయి. ‘భైరవకోన’లోకి ఎంటరైన తర్వాత జర్నీ అంతా థ్రిల్లింగా వుంటుంది.

ఈ సినిమా కోసం సందీప్ కిషన్ చాలా హార్డ్ వర్క్ చేశారు కదా ? తనకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని ఇస్తుందని భావిస్తున్నారు ?

సందీప్ కిషన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తనే ఈ సినిమాకి హెల్ప్ అయ్యాడనే విధంగా చేశాడు. తన కెరీర్ కి, మా బ్యానర్ కి ఇది నెంబర్ 1 సినిమా అవుతుందనే నమ్మకం వుంది.

కొత్తగా చేస్తున్న చిత్రాలు?

అల్లరి నరేష్ గారితో బచ్చల మల్లి షూటింగ్ జరుగుతోంది. అలాగే కిరణ్ అబ్బవరంతో ఓ సినిమా చేయబోతున్నాం.

ఒకే  ఆల్ ది బెస్ట్ అండ్  థాంక్ యూ రాజా గారూ ..

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *